Wednesday, 25 November 2026

హైదరాబాద్

ఏక్తాకపూర్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి

ముంబయి : బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తాకపూర్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. దాదాపు వందమంది అధికారులు ఆమె ఇంటిని, బాలాజీ టెలిఫిల్మ్స్‌ కార్యాలయాలను సోదా చేశారు. బాలాజీ టెలిఫిల్మ్స్‌ కి జేఎండీగా ఉన్న…

ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరు…

రాష్ట్రంలో వడగళ్లవాన పడే అవకాశం

వాతావరణ శాఖ హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 48 గంటలలో వడగళ్లవాన పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించొద్దు : హైకోర్టు

హైదరాబాద్‌ : గ్రూప్‌-1 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించవద్దంటూ హైకోర్టు ఏపీపీఎస్పీని ఆదేశించింది. మెయిన్స్‌లో తప్పులు దొర్లాయంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు పైవిధంగా స్పందించింది.

వ్యవసాయ సంపదపై పన్నులేదు

చిదంబరం ఢిల్లీ : వ్యవసాయ రంగంపై సంపద పన్ను లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జూలై 1,2010 నుంచి అక్టోబర్‌ 1,2012 వరకు రైల్వేకు సేవాపన్ను మినహాయింపు ఉన్నట్లు చిదంబరం పేర్కొన్నారు.

లారీ, బైక్‌ ఢీకొని ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెదక్‌లోని జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.

ప్రధానితో భేటీ అయిన అహ్మద్‌పటేల్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.

బొగ్గు కుంభకోణంపై విచారణ మే 8కి వాయిదా

న్యూఃఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది. ఏ నిబంధనల మేరకు దర్యాప్తు నివేదిక వివరాలు చెప్పారో తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు అదేశించింది. ప్రభుత్వానికి నివేదిక విషయాలు తెలిపిన అంశంపై మే…