Wednesday, 25 November 2026

హైదరాబాద్

విదేశీ పర్యనకు వెళ్లిన డిప్యూటీసీఎం

హైదరాబాద్‌: డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలు దేరి వెళ్లారు. హాంకారగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.

ఏనుగుల బీభత్సం

చిత్తూరు, బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పంటలు, తోటలు భారీగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు భయంతో గ్రామం వదిలివెళ్లిపోయారు.

నదిలో పడి నలుగురు మృతి

చైన్నై, జనంసాక్షి: తిరుచ్చి వద్ద కావేరి నదిలో ప్రమాదవశాస్తు జారీ పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే వారిని కాపాడేందుకు స్థానికులు చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి. ఈఘటన ఆదివారం ఉదయం…

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుపతి, జనంసాక్షి: వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐసీ బ్రేక్‌ దర్శనాలను మే నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఆదివారం తిరుమలలో వెల్లడించారు. గురువారం ఒక్కరోజు మాత్రం వీఐపీ బ్రేక్‌…

రౖలు ఢీకొని మూడు ఎలుగుబంట్లు మృతి

నల్లగొండ: జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి-ముత్తిరెడ్డిగూడెం మధ్య ఉదయం గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. డ్రైవర్‌ దీనిని భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనస్థలికి చేరుకొని పరిశీలించారు. దీంతో…

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం రాజన్న గూడలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లా నారాయణపురంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి…

విదేశీ పర్యటన వెళ్లిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.

నేడు కర్ణాటకలో నరేంద్రమోడీ ప్రచారం

బెంగళూర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు.

బాసరకు భక్తుల తాకిడి

అదిలాబాద్‌: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో అమ్మవారిని ఇంటర్‌, టెన్త్‌ విద్యార్థులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఏవిదమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.