Tuesday, 24 November 2026

హైదరాబాద్

అదృష్ఠ వాస్తు ప్రమాదం తప్పిన సిర్పూర్‌ ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ గ్రామీణం, ఆదిలాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వాహనం ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దుప్పి ఢీకొనడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.…

తాజ్‌మహల్‌ హోటల్‌లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రిమిస్తున్నారు. గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.

శ్రీపతి రాజేశ్వర్‌ మృతికి సంతాపం చేపట్ట్ణిన తెదేపా నేతలు

విశాఖ: ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకొడుకులు సపావట్‌ చిట్టి(37), చంద్రబోస్‌ (15) అక్కడే అత్మహత్యకు…

అనారోగ్యం బాద భరించలేక భవనంపై నుంచి దూకి మహిళ మృతి

హైదరాబాద్‌: శేరిలింగంపల్లిలో రెండంతస్తుల భవనంపై నుంచి దూకి సంధ్యా దేవి (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భవనం ముందు ఉన్న ప్రధాన ద్వారంపై పడటంతో చువ్వలు గుచ్చుకుని మృతదేహం వేలాడుతోంది. అనార్యోగం కారణంగానే అమె అత్మహత్య చేసుకుందని…

ఎన్టీఆర్‌ మెమోరాయల్‌ ట్రస్టు రక్తనిధిని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ: ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు రక్తనిధిని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో బాలకృష్ణతో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. నిన్న విశాఖలో పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని అరోపిస్తూ కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆమన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సొంత జిల్లా మెదక్‌లో ఈ నెల 29న ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఇందిరమ్మ కలలు కార్యక్రమానికి రాజనర్సింహ…

నేడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బెంగళూరులో నిర్వహించే ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. మోడీ ప్రచారం తమకు కలిసివస్తుందని అధికార భాజపా భావిస్తోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌, అగ్రనేత…

అనారోగ్యం వల్ల మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజేశ్వర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా…