Thursday, 19 November 2026

హైదరాబాద్

20,21 తేదీల్లో దేశవ్యాప్త బంద్‌ : ఐఎన్‌టీయూసీ

హైదరాబాద్‌: కార్మిక చట్టాల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల డిమాండ్ల సాధనకు తలపెట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ అనుబంధసంస్థ…

వేధింపుల కేసులో ఉపాధ్యాయురాలి వాంగ్మూలం

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ వేధింపుల వ్యవహారంలో ఉపాధ్యాయిని లీలావతి ఈ రోజు రాజేంద్రనగర్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి 8 ఎంఎం కోర్టులో లీలావతి దాదాపు గంటపాటు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలమిచ్చారు అదృశ్యం…

భూహక్కుల కోసం గిరిజనుల ధర్నా

కరీంనగర్‌: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తోన్నారు.

రాహుల్‌తో ముగిసిన కాంగ్రెస్‌ నేతల సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశం అనంతరం బోత్స విలేకరులతో…

కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌: కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలునుంచి అక్బరుద్దీన్‌ విడుదల కానున్నారు. దీంతో జైలు వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుపై ఇటలీ వెళ్లనున్న అధికారుల బృందం

ఢిల్లీ: హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు కోసం రక్షణశాఖ, సీబీఐ అధికారుల బృందం రేపు ఇటలీ వెళ్లనుంది. ఇటలీ న్యాయవాదుల నుంచి ఈ  బృందం వివరాలు సేకరించనుంది.

చమురు ధరలు పెంపుపై సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: ప్రభుత్వం చమురు ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం చేశారు.…

కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపునొప్పొ లేవడంతో చికిత్స నిమిత్తం  ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం…

అక్బరుద్దీన్‌ విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ పాస్‌పోర్టును న్యాయవాదులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: ఈరోజు నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200గా ఉంది. కిలో వెండి…