Wednesday, 18 November 2026

హైదరాబాద్

బెయిల్‌ కుంభకోణాల కేసుల విచారణ 15కు వాయిదా

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణాల కేసుల్లో గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు సిబ్బంది ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేష్‌బాబు, మాజీ న్యాయమూర్తులు పట్టాభి రామారావు, చలపతిరావు, ప్రభాకర్‌రావు, లక్ష్మీ నరసింహారావుతో పాటు ఇతర నిందితులు…

నవీపేట పీఏసీఎస్‌ పరిధిలో ఇద్దరు డైరెక్టర్ల అపహరణ

నిజామాబాద్‌: నవీపేట సహకారసంఘం పరిధిలోని ఇద్దరు డైరెక్టర్లను కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అభ్యర్థి అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందించి. దీనిపై ఆర్డీఓ విచారణ చేపట్టారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి, పలువురి అరెస్టు

హైదరాబాద్‌: శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు.

ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా

హైదరాబాద్‌: ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని డిస్కంలను సీఎం ఆదేశించినట్లు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. అనంతరం పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ…

సీఎం కిరణ్‌పై ఎంపీ మందా జగన్నాథం ఫైర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నాగర్‌ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. సీఎంకు మానవత్వం ఉంటే శంకర్రావు అరెస్టు చేసిన తీరును చూసి స్పందించాలన్నారు. పోలీసుల ప్రవర్తనపై సీఎం సమాధానం చెప్పాలని మందా డిమాండ్‌ చేశారు. శంకర్రావు అరెస్టు…

శంకరావు వ్యవహారంపై డీజీపీ సమావేశం

హైదరాబాద్‌: శంకరరావు వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, మల్కాజ్‌గిరి డీసీపీ పాల్గొన్నారు.

చైనాలో వాహనం పేలి 26 మంది మృతి

జీజింగ్‌ : చైనాలోని సన్‌మాన్‌గ్జియాలో మందుగుండు సామాగ్రితో వెళ్తున్న వాహనం పేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.సన్‌మాన్‌గ్జియాలో  ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి బ్రిడ్జి దెబ్బతింది.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,690లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,900లుగా ఉంది. కిలో…

ప్రభుత్వానివి కక్ష సాధింపుచర్యలు : కోదండరాం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. పదవులకు విలువ ఇవ్వకున్నా పోలీసులు శంకర్‌రావు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. శంకర్‌రావు అరెస్టుకు ప్రోత్సహించిన…

పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం తెలిసింది.