Wednesday, 18 November 2026

హైదరాబాద్

సుప్రీంకోర్టుకు వెళ్లను : కమల్‌హాసన్‌

చెన్నై : మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనని ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ‘ విశ్వరూపం’ సినిమా వివాదం నేపధ్యంలో చిత్ర విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తానని కమల్‌ నిన్న ప్రకటించారు.…

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు హాజరు కాకపోవడంపై తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు  ఎనిసార్లు హాజరయ్యారని ఆయన…

పాక్‌ ఆరోపణలను ఖండించిన భారత్‌

ఢిల్లీ : భారత సైన్యం గతంలో తమ సైనికుల తలలు నరికిందన్న పాకిస్థాన్‌ ఆరోపణలను భారత రక్షణ మంత్రి ఎ. కె ఆంటోనీ ఖండించారు. పాక్‌ వాదన పూర్తిగా నిరాధారమని కేంద్రం పేర్కొంది.

కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణకు ఆయన న్యాయస్థానానికి రావలసి వచ్చింది.

ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సు ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సును ప్రారంభించారు.  ఈసందర్శంగా ఆయన  మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. అంతర్జాయతీంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వృద్ధి సాధించాల్సిన అవశ్యకత ఉందని…

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కూరు సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఓటర్లను ఓటు వేయకుండా ఆపేస్తున్నారంటూ తెదేపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ…

నేడు కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలంటూ రాజీనామా అస్త్రాలతో అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకువస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ కేకే నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…

చిలీలో భూకంపం

చిలీ : చిలీలోని అటకామాలో భారీ భూకంపం సంభవించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.7గా నమోదైంది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.

నేటి నుంచి మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌

ముంబయి: మహిళల క్రికెట్‌లో ప్రపంచకప్‌ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల పదో వన్డే ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభకానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు భారత్‌ వెస్టిండీన్‌తో తలపడుతోంది. మధ్యాహ్న 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ క్రికెట్‌…

ప్రయాణీకుల ఆందోళనతో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

శ్రీకాళహస్తి : ప్రయాణీకుల ఆందోళనతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి యల్లకారు. మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో యాతలూరు వద్ద రైలు నుంచి ఓ ప్రయాణీకుడు జారీ కింద పడిపోయాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణీకులు పట్టాలపై…