రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
చెన్నై : తమిళనాడులోని సేలం, ధర్మపుని జిల్లాల్లో ఈ రోజు భూమి స్వల్పంగా కంపించింది. వీటి తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.3గా నమోదైంది. భూప్రకంనలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో బీజేసీ సభావక్ష నేత సుష్మాస్వరాజ్ ఈరోజు భేటీ అయ్యారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తేనే సభ సజావుగా సాగుతుందని సుష్మాస్వరాజ్ స్పీకర్‌కు తేల్చిచెప్పారు.
హైదరాబాద్: బెయిల్ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడుజ రైల్వేస్టేషన్ ఆవరణలో ఉన్న మూడు ఆటోలను ధ్వంస చేశాడు. స్టేషన్‌లో రైలు కోసం వేచివున్న ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో…
హైదరాబాద్: సహాయ గణాంకాధికారి (ఏఎన్‌వో) ఫలితాలను ఏపీపీఎస్సీ ఈరోజు ఉదయం విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి డిసెంబరు 6 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ బుద్వేల్ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్‌లోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.15 లక్షలు విలువచేసే 508 కాటన్‌ల లిక్కర్‌ను అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన వారు పరారు కాగా,…
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్ నాందెడ్ల మనోహర్‌కు సమర్పించారు. రాజీనామా సమర్పణను ముందు పెద్దిరెడ్డి పీసీసీ చీఫ్ బొత్సతో భేటీ అయ్యారు. రాజీనామా యోచర విరమించుకోవాలని…
ఉసురుగుట్ట: వరంగల్ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న పెర్త్ టెస్ట్‌కు ముందే పాంటింగ్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 1995లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన పాంటింగ్ ఇప్పటివరకూ…