Sunday, 15 November 2026

హైదరాబాద్

సచివాలయం ముందు ఓయూవిద్యార్థుల ధర్నా

హైదరాబాద్‌: సచివాలయం ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. నవంబర్‌ 1న రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

పెను తుపానుగా మారనున్న నీలం

చెన్నై: బంగాళాఖాతంలో చెన్నై తీరానికి సమీపంలో 260 కి. మీ దూరంలో కేంద్రీ కృతమై ఉన్న నీలం పెను తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సాయంత్రానికి పుదుఛ్ఛేరి-నెల్లూరు మధ్య తీరందాటే…

మహాబలిపురంలో 11 సెం.మీ వర్షాపాతం

చెన్నై: నీలం తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహాబలిపురంలో 11 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నుంచి పలు రైళ్లు…

గాలి జనార్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 9వ నిందితుడిగా జనార్థన్‌ రెడ్డి ఉన్నారు.

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి

ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని మన్మోహస్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్‌ వద్ద నేతలు ఇందిరకు…

పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కరీంనగర్‌ మండలం కొత్తపల్లిలోని ఆల్ఫోర్‌ ఈ-టెక్నో పాఠశాలలో…

ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

చిత్తూరు: రామచంద్రాపురం మండలం ఎన్‌,ఆర్‌.కమ్మపల్లి వద్ద ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను  తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశమయ్యారు.

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంథీ అల్లుడు…

మనీలాలో స్వల్ప భూకంపం

మనీలా: ఫిలిఫిన్స్‌ రాజధాని మనీలా స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైంది. ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అక్కడక్కడ భవంతులు కదిలినట్లు సమాచారం