Wednesday, 11 November 2026

వరంగల్

150 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

వితంతువులకు సమానహక్కు కల్పించాలి

వరంగల్‌,(జనంసాక్షి): అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో వితంతువులు భారీ ర్యాలీని నిర్వహించారు. వితంతువుల సమానతకై పోరాడుదామంటూ కలెక్టరేట్‌ నుంచి బాల వికాస ఆధ్వర్యంలో ఖాజీపేట వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.…

టీ కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలో కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ తగిలింది. హసన్‌పర్తి మండలం ఆరెపల్లిలో ఉరువాక ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తామని చెప్పి పదవుల్లో ఇంకా ఎందుకు…

సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్‌ జిల్లా వాసులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్‌ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ వీరికి స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు నరకాన్ని అనుభవించామని యాత్రకు వెళ్లొచ్చిన వారు…

కాజీపేటకు చేరుకున్న చార్‌థామ్‌ యాత్రికులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్‌ యాత్రకులు కాజీపేట రైల్వేే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్‌ చేరుకున్న వరద బాధిత యాత్రకులకు స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆహారం, మంచినీటి బాటళ్లను అందజేశారు. పది మంది…

జనగాంలో పలు హోటళ్లపై కేసులు నమోదు

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని జనగాం పట్టణంలో పలు హోటళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దాడుల్లో పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 150 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటళ్లకు అక్రమంగా…

రైలు ఢీకొని మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): మహబూబాద్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఐసెట్‌ కన్వీనర్‌పై అట్రాసిటీ కేసు నమోదు

వరంగల్‌,(జనంసాక్షి): ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐసెట్‌ రూట్‌ ఎంపికలో కన్వీనర్‌ కుల వివక్ష చూపారంటూ ఎస్సీ కాంట్రాక్టు అధ్యాపకులు వరంగల్‌ పోలీసులకు ఫఙర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు…

బైక్‌-లారీ ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని డోర్నకల్‌ మండలం గొర్లచర్ల గ్రామం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాయల్‌ తెలంగాణ వద్ద: వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌, (జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు, రాయల్‌ తెలంగాణ వద్దు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ…