Wednesday, 11 November 2026

వరంగల్

విద్యార్థి పరిస్థితి విషమం – విద్యార్థిసంఘాల ధర్నా

వరంగల్‌ ఎంజీఎం: ఈ రోజు ఉదయం తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రి ఎదుట ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా…

తెలంగాణ కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య యత్నం

ఆత్మకూరు : వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలంలోని గురుగొండ గ్రామ పరిధిలోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కె. నీరజ్‌ భరద్వాజ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం 8:30గంటల ప్రాంతంలో కళాశాలకు చేరుకున్న అతడు తనవెంట…

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

వర్దన్నపేట : వరంగల్‌ జిల్లా వర్దన్నపేట సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని తెదేపా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను…

ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు 3వ తేదీలోపు దరఖాస్తు చేయండి ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెటల్స్‌ లో నిబందనలకు విరుద్దంగా ఉన్న ప్రవాసాంద్రులు రాష్టాన్రికి రావడానికి…

వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు  కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఢీ : నలుగురికి గాయాలు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లకినేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయసడినవారికి చికిత్స నిమిత్తం…

పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం తెలిసింది.

తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధం : ఎర్రబెల్లి

వరంగల్‌ : సహకార ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధంగా ఉందని  ఆపార్టీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుండటం వల్లే తెరాసకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖానాపురం : వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటలో ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతున్ని అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ జి. రమణ (33)గా గుర్తించారు. పోలీసులు కేసు…

2న పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

వరంగల్‌, జనవరి 31 (): ఫిబ్రవరి 2న డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో  పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరకాల సబ్‌ డివిజన్‌లోని పరకాల, రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి,…