Wednesday, 25 November 2026

సీమాంధ్ర

లంకభూములను రిజిస్ర్టేషన్‌ చేయించండి.

విజయవాడ: రాజధాని పరిధిలోని ఉద్దండ్రాయుని పాలెం లంక భూములకు రిజిస్ర్టేషన్‌ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతులు వినతిపత్రాన్ని సమర్పించారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని హామీ ఇచ్చారని, దాంతో తాము…

స్టేజీలలో ఆపకపోతే క్రమశిక్షణ చర్యలు

గుంటూరు: ఆర్టీసీలో నష్టాలను అధిగమించి, లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరు ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌ను ఎండీ సోమవారం తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు…

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి నీటివిడుదలను సోమవారం నిలిపివేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు.

విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం…ఇద్దరు మృతి

విశాఖపట్నం ,  నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సాయినాథ్‌ కెమికల్స్‌ అనే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన కార్మికులను హేమంత్‌కుమార్,…

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌

నెల్లూరు, షార్ అంతరిక్షకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ0 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం భారత్‌కు చెందిన ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఖగోళ పరిశోధనల్లో ఇస్రోకు ఇది తొలి ప్రయోగం. 6…

అదితి కోసం కొనసాగుతున్న గాలింపు

విశాఖ నగరంలో గల్లంతైన అదితి కోసం గాలింపు కొనసాగుతుంది. అదితి సంఘటనలో కిడ్నాప్‌ కోణం లేదని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. అదితి మృతదేహం సముద్రంలో లేదని నేవీ సిబ్బంది నిర్ధారించారు. దీంతో అదితి ఘటన మిస్టరీగా మారింది.

స్కూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు గాయాలు

పశ్చిమగోదావరి,  జిల్లాలోని మొగల్తూరు మండలం కంతోటలో వేగంగా వస్తున్న ఓ స్కూలు బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో విద్యార్థులు ఆందోళన చెందారు.

టీటీడీ ట్రస్టుకు హెచ్‌సీఎల్‌ అధినేత రూ.కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని బాలమందిర్‌ ట్రస్టుకు హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సోమవారం శ్రీవారిని కేంద్రమంత్రి సుజనాచౌదరి, హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రకాశం జిల్లాలో భారీ దోపిడీ

మార్టూరు, జిల్లాలోని మార్టూరు పట్టణంలో మువ్వ అంజయ్య అనే గ్రానైట్‌ యజమాని ఇంట్లో గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి రెండుగంటలకు కత్తులు, రాడ్లతో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. అంజయ్య కుటుంబసభ్యులను కట్టేసి 78 సవర్ల బంగారం, వెండి…

స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు గడువు పొడిగింపు

గుంటూరుప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌, ఉర్దూ, ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువతున్న విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ ఎనిమిదో తేదీన…