Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఒడిసా వద్ద అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 21: ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో విస్తారంగా,…

దారి దోపిడీ

సెప్టెంబరు 21 : గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారి దోపిడీ జరిగింది. దొంగలు ఈ మార్గంలో మూడు వాహనాలను అడ్డుకొని సీసాలతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌లను అపహరించారు. దొంగలు కొందరిని కొట్టారు. ఈ ఘటనలో…

28న PSLV C-30 ప్రయోగం

సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. ఈ నెల 28, ఉదయం 10 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-30ని ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన…

బంగాళాఖాతం వైపు అల్పపీడన ద్రోణి

అండమాన్‌ పరిసరాల నుంచి మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం కదులుతోంది. మూడు రోజుల తర్వాత తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య విదర్భ ప్రాంతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయవ్యం వైపు…

కొనసాగనున్న సైకో సూదిగాడి దాడులు…

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి పాలయింది. తీవ్రంగా రక్తపు వాంతులు చేసుకుంటోంది. గత నాలుగు రోజుల…

డెంగీతో మహిళ మృతి.

విజయవాడ : పాత సింగ్ నగర్ లో డెంగీతో మహిళ మృతి చెందింది. సీపీఎం నేత నర్సింగరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

విశాఖలో కుక్కలదాడి ఘటనపై నారాయణ ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను ఆదేశించారు. వారంలోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్లకు మంత్రి…

నెల్లూరులో రొయ్యల వ్యాపారి కిడ్నాప్

నెల్లూరు, సెప్టెంబర్ 19 : నవాబుపేట మారుతీ నగర్‌లో రొయ్యల వ్యాపారి సుధాకర్‌రెడ్డి కిడ్నాప్‌‌కు గురయ్యాడు. వ్యాపార భాగస్వాములే కిడ్నాప్‌ చేశారంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో సుధాకర్‌రెడ్డి తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంటూరులో సీపీఐ రిలే నిరాహార దీక్షలు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ ఈ దీక్షలను ప్రారంభించారు.