Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్రచందనం దుంగలు మాయం

కడప: జిల్లా ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలలోని కొన్ని దుంగలను దొంగలు ఎత్తుకెళ్లారు.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

చిత్తూరు: జిల్లాలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును శుక్రవారం శ్రీకాళహస్తి పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ముఠా సభ్యుల నుంచి భారీగా నగదుతో పాటు వివిధ బ్యాంకులకు…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….

తిరుమల:తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ:ఇద్దరి మృతి

చిత్తూరు: చంద్రగిరి మండలం తండవాడ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

మున్సిపల్ ఆర్డీ ఇంట్లో ఏసీబీ సోదాలు

 రాజమండ్రి (తూర్పు గోదావరి) : ఓ ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఏపీ  మున్సిపల్ శాఖ ప్రాంతీయ డెరైక్టర్ (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజమండ్రిలోని…

శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం:30 ఇళ్లు దగ్ధం

శ్రీకాకుళం:జిల్లాలోని లావేరు మండలం మురపాక వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్లు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం:సీతంపేట ఏజెన్సీ గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది నెలలుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తున్న నాలుగు ఏనుగుల గుంపులు తాజాగా పాడలి పంచాయతీ పరిధిలోని దబ్బగూడ గ్రామంపై పడ్డాయి. సమీపంలో ఉన్న మామిడి, జీడి పంటలను ధ్వంసం…

భూ తగాదాలో తండ్రిని చంపిన కొడుకు…

గుంటూరు:జిల్లాలోని భూ వివాదం తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారి పాలెంలో తండ్రీ కొడుకుల మధ్య ఓ భూమి విషయమై తగాదా పడ్డారు. దీంతో ఆవేశం ఆపుకోలేని కొడుకు.. తన తండ్రిని హత్య చేశారు.…

అదుపు తప్పి లారీ బీభత్సం:మూడు షాపులుధ్వంసం

కృష్ణా: నూజివీడు లోగల శ్రీనివాససెంటర్‌లో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి మూడు షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపులు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

లారీని ఢీకొన్న బొలేరో వాహనం:ఇద్దరి మృతి

కర్నూలు: చాగలమర్రి సమీపంలో జాతీయరహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా పీలేకు చెందిన కార్తీక్, రషీదగా గుర్తించారు.