Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పాడేరు ఘాట్‌రోడ్డుపై జీపు బోల్తాపడి మహిళ మృతి

విశాఖ, మార్చి 23 : విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో డైమండ్‌ పార్కు వద్ద జీపు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళ మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

గొర్రెలమందపై చిరుతల దాడి

అనంతపురం, మార్చి 23 : అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిప్పేపల్లిలో చిరుతలు కలకలం సృష్టించాయి. గొర్రెలమందపై చిరుతలు దాడి చేశాయి. ఈ సంఘటనలో 15 గొర్రెలు మరణించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనల్లో ఉన్నారు.

షార్‌లో 28న పీఎస్‌ఎల్‌వీ – సి 27 రాకెట్‌ ప్రయోగం

శ్రీహరికోటలోని షార్‌లో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 27 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇది షార్‌ ప్రయోగిస్తున్న 3వ నావిగేషన్‌ శాటిలైట్‌. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ -1 డి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సోమవారం సాయంత్రానికల్లా శాటిలైట్‌ అనుసంధాన…

విద్యుత్‌షాక్‌తో నవ దంపతుల మృతి

గుంటూరు, మార్చి 23 : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నవదంపతులు మృతి చెందడంతో విషాదం అలముకుంది. బట్టలు ఆరేస్తుండగా భార్యకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో భార్యను కాపాడబోయి భర్త కూడా మరణించాడు.

అమరావతిలో ఆనందోత్సవాలు

గుంటూరు, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరానికి అమరావతి పేరును నిర్ణయించడంపై అమరావతి వాసులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. అమరావతిలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

రూ. 42 లక్షల గంజాయి స్వాధీనం

తూర్పుగోదావరి, మార్చి 23 : తూర్పుగోదావరి జిల్లా ఏవోబీ సరిహద్దుల్లో గంజాయిని అక్రమంగా రవాణ చేస్తున్న ముగ్గురి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు, రూ.42 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.…

ప్రేమకు అడ్డువస్తుందని తల్లిని చంపిన తనయుడు

హైదరాబాద్: తన ప్రేమకు అడ్డువస్తుందనే కోపంతో కన్నతల్లినే హతమార్చాడో తనయుడు. ఈ విషాద సంఘటన ఏపీలోని విశాఖనగరం గాజువాక ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత మూడు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని…

రాజమండ్రిలో ప్రశాంతంగా పోలింగ్..

రాజమండ్రి : తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుండి ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థిగా…

డబ్బు రాజకీయాలు..నశించాలి – సీపీఎం..

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికలు..ఎలాంటి రాజకీయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు రాజకీయమయం చేసేశారు..ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పోలింగ్ లో అధికార పార్టీ నేతలు…