Tuesday, 24 November 2026

సీమాంధ్ర

పాము కాటుకు గురైన ఓ మహిళ మృతి

బలిజపేట: విజయగనరం జిల్లా బలిజపేట మండలంలోని తుమరాడ గ్రామంలో పాము కాటుకు నారాయణమ్మ (48) మృతి చెందింది. వరి పంట ఉబాలు కోసం శనివారం పొలం వెళ్లిన ఆమె పాము కాటుకు గురైంది. ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆదివారం…

24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్రమీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో…

సమస్యల పరిష్కారం కోరుతూ పోలింగ్‌ బహిష్కరణ

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మేడి కొండూరు ఎస్టీ కాలనీలో తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలింగ్‌ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ కల్యాణ్‌ జ్యోతి సేన్‌ గుప్తా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ…

అధికారి నుంచి నగదును అపహరించిన దుండగులు ఆగిపోయిన ఓట్ల లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట పంచాయతీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జోన్‌-1 అధికారి నుంచి రూ. 1.35 లక్షల నగదును దుండగులు లాక్కెళ్లారు. దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద లెక్కింపు ఆగిపోయింది.…

శంఖవరం మండలంలో ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి మూడో వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఓట్లు లెక్కించడానికి బ్యాలట్‌ బాక్సుల తీసుకు వెళ్లనివ్వకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది. ఒక పార్టీకి సహకరించి రిగ్గింగుకు…

భోజనాలు రాలేదని నిలిపివేసిన ఓట్ల లెక్కింపు

అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లాలోని బెళగుప్పలో భోజనాలు రాలేదని ఎన్నికల సిబ్బంది మధ్యాహ్నం రెండున్నర అవుతున్నా ఓట్ల లెక్కింపు ప్రారంభించలేదు. రెండు గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావలసి ఉంది.

దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం మూలపాడులో తెదేపా కార్యకర్తలకు మద్దతుగా పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూలపాడులో ఓకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి…

ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

కడప: జిల్లాలోని పుల్లంపేట మండలంలోని టి. కమ్మపల్లి, టి. బలిజపల్లెలో 9,10 వార్డులకు సంబంధించిన ఖాళీ బ్యాలెట్‌ బ్యాక్సుల్లో గ్రామస్థులు నీళ్లు పోశారు. గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించినప్పటికీ అధికారులు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఆగ్రహించి బ్యాలెట్‌ బాక్సులో…

పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

చిత్తూరు(జనంసాక్షి): జిల్లాలోని ఐరాల మండలం వేదగిరి వారిపల్లెలో ఓటర్లపై ఎస్‌.ఐ దాడి చేశారు. పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వైఖరిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.