Tuesday, 24 November 2026

సీమాంధ్ర

వస్తువుల పేరుతో టోకరా

నందిగామ: కృష్ణ జిల్లా నందిగామలో ఆర్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తమిళనాడుకు చెందిన వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. సగం ధర చెల్లిస్తే చాలు వస్తువులు విక్రయిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారు. గడువు ముగిసినా వస్తువులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆర్‌.కె.…

ఏటీఎం నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

రాజమండ్రి,(జనంసాక్షి): ఏటీఎం నగదు నిర్వహకుడి హత్య ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11మంది నిందితులపు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు.

పిడుగుపడి ఇంద్దరు విద్యార్థులు మృతి

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా సంతకవిడి మండలం తలతంపరలో పిడుగుపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో చెట్టు కింద తరగతులు నిర్వహించడం వలనే విద్యార్థులపై పిడుగు పడిందని…

వాహన తనిఖీల్లో రూ. 4లక్షలు స్వాధీనం

గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఓట్ల తొలగింపుపై విచారణకు ఆదేశం ఈనాడు కథనానికి స్పందించిన అధికారులు

చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి 7వేల ఓట్లు తొలగించినట్లు వచ్చిన అరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల గల్లంతుపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ అరోగ్య రాజు…

పోలీస్‌స్టేషన్‌ దాడి, కాల్పుల ఘటనపై విచారణ ప్రారంభం

కృష్ణా: కృష్ణా జిల్లా జి. కొండూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ అబ్దుల్‌హక్‌, సీఐ బంగార్రాజును ఏఎస్పీ షెమోషీ బాజ్‌పాయి విచారిస్తున్నారు.

పంచాయతీ ఓట్ల గల్లంతుపై విచారణ చేపట్టిన ఈసీ

చిత్తూరు,(జనంసాక్షి): సదుం మండలంలోని నాలుగు పంచాయితీల్లో అత్యధిక ఓట్లు గల్లంతుపై ఎన్నికల సంఘం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ మంగళవారం వెల్లడించారు. గ్రామాల్లో 20 శాతం మేర ఓట్లు తొలగించినట్లు తెలిపినట్లు అయితే పోలీస్‌ కేసులను నమోదు…

నరసరావుపేటలో భారీ చోరీ

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలయ సమీపంలో ఉన్న కొత్త శ్రీవానిసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి రూ. 5లక్షల విలువైన బంగారు అభరణాలు, 6కిలోల వెండి వస్తువులు,…

రాజంపేట మార్కెట్‌ వద్ద ఆందోళన చేపట్టిన వ్యాపారులు

కడప,(జనంసాక్షి): రాజంపేట మార్కెట్‌వద్ద రోడ్డు ఆక్రమించారంటూ చిరు వ్యాపారులపై మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వ్యాపారులను అక్కడి నుంచి తొలగించేందుకు…

శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీవారి అలయంలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే అణివార అస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, అలయ సిబ్బంది అలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో…