Tuesday, 24 November 2026

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మాచినతండా వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి రాళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన బస్సు క్లీనర్‌ నదీమ్‌పాషా (35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి…

ప్రేమజంటపై దాడి: అమ్మాయి హత్య

కడప,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో ప్రేమజంట పై అమ్మాయి తరపువారు దాడి చేశారు. కుత్తులతో దాడి చేసి ప్రియురాలిని హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రియుని పరిస్థితి విషమంగా ఉంది.

ఒంగోలులో రూ.4లక్షలు అపహరించిన దుండగులు

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రాబ్యాంకు వద్ద ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 4లక్షలు అపహరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బంగారం దుకాణంలో భారీ చోరీ

ఎస్‌. రాయవరం: విశాఖజిల్లా ఎస్‌. రాయవరం మండలం అడ్డరోడ్డులో ఉన్న ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. లంక రామశేషుకు చెందిన సాయితేజ జ్యూలరీస్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కేజీల వెండి,…

ఆధార్‌ కార్డుల కోసం బారులు తీరిన జనం

కర్నూలు : నగరంలో ఆధార్‌ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. దీంతో ఆధార్‌ కేంద్రం వద్ద తీవ్ర రద్దీ నెలకొని, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్క ఆధార్‌ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేయడంపై…

కారు బోల్తాపడి నలుగురికి గాయాలు

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై దెందులూరు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాదులోని బోయినపల్లి ప్రాంతానికి చెందిన పచ్చళ్ల…

ఎనిమిదో రోజుకు చేరిన నైవేలి కార్మికుల సమ్మె

కడలూరు: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకొంది. ఈ సంస్థలో కేంద్రం వాటా 5 శాతాన్ని విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. దాదాపు 30వేల మంది కార్మికులు ఈ సమ్మెలో…

పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా జి. కొండూరులో పోలీసు కాల్పుల్లో గాయపడిన కృష్ణారావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అయనకు వైద్యులు కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

నెల్లూరు (ఫతేఖాన్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ట్రంకురోడ్డు, గాంధీ బొమ్మ, వి. ఆర్‌. జి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.…

సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

తిరుపతి,(జనంసాక్షి): సమైక్యాంధ్రకుకు మద్దతుగా తిరుపతి నగరంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి పట్టణ క్లబ్‌ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దాంతో నగర వీధులల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు…