Tuesday, 24 November 2026

సీమాంధ్ర

జనసంద్రమైన విశాఖసాగరతీరం

విశాఖసట్నం, జనంసాక్షి: విశాఖ సాగరతీరం జనసంద్రమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకుల రాకతో సాగరతీరం నిండిపోయింది. కాసేపట్లో తెలుగుదేశం బహిరంగ సభ ప్రారంభం కానుంది.

పైలాన్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

విశాఖపట్నం, జనంసాక్షి:  ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర విజయస్థూపాన్ని (పైలాన్‌) తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. విజయస్థూపం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. అనంతరం విజయస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ,  లోకేష్‌,…

ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రాన్ని చీఫ్‌ కంజర్వేటర్‌ ఫారెస్ట్‌ ఎస్‌.వి. కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూపార్కుకి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూపార్కులో…

విశాఖలో బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహనం తెప్పించిన తెదేపా

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు నేపధ్యంలో నిర్వహించనున్న బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహన్ని అమెరికా నుంచి తెప్పించారు. తెదేపా విశాఖ నగర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు రూ.6లక్షల వ్యయం చేసి దీనిని ఏర్పాటు…

కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు

విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్‌ సందడిగా మారింది. తెదేపా సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం…

చంద్రబాబును కలుసుకుంటున్న నేతలు

విశాఖ, జనంసాక్షి: రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నరసింహులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు చంద్రబాబును కలుసుకున్న వారిలో ఉన్నారు.

ఏసీబీకి చిక్కిన మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు

మాచర్ల , జనంసాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు ఏసీబీకి చిక్కారు. ఓ కేపుకు సంబందించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీఐని పట్టుకున్నారు.

పసుపుమయమైన విశాఖ

విశాఖ, జనంసాక్షి: ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న తెదేపా శ్రేణులు, అభిమానులతో విశాఖ నగరం రద్దీగా మారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు పార్టీ తోరణాలతో పసుపుమయమయ్యాయి.…

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి. శివధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం2 గంటల రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.…

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

తిరుపతి, జనంసాక్షి: రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రధాన భవనానికి తాళం వేసి నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని 13 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.