Thursday, 12 November 2026

మెదక్

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని కుటంబంమే లేదు:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

మెదక్‌: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి 3నుంచి 5సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభ్ధి పొందని కుటుంబంలేదన్నారు. అభివృద్దిని…

మెదక్‌ చర్చిని సందర్శంచిన ముఖ్యమంత్రి

మెదక్‌: ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సందర్శిచారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల  ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యతను మత గురువులు…

రామలింగారెడ్డి ముందస్తు అరెస్టు

సిద్దిసేటఅర్బన్‌ ,దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రాయలింగారెడ్డి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ప్రజాసమస్యలు పరిష్కరిచకుండా ఇందిరమ్మబాట నిర్వహిస్తున్న సీఎంను అడ్డు కుంటామని రామలింగారెడ్డి ప్రకటించటంతో పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు…

ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌ బస

మెదక్‌: ఇందిరమ్మ బాటలో బాగంగా మెదక్‌ జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహపంక్తి బోజనం చేశారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

మెదక్‌: జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గోనడానికి వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దింతో పరిస్థితి ఆందోళనకారణంగా మారింది.

రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం

మెదక్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు.…

మెదక్‌ జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం

మెదక్‌ : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. దుబ్బాక మండలం చీకోడుకు సీఎం చేరుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారు లతో సమావేశమయ్యారు. జీల్లాలో మూడు రోజులపాటు తోమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 260 కిలోమీటర్ల మేర సీఎం పర్యటించనున్నారు.

ప్రతిఘటన తప్పదు: కేటీఆర్‌

చేగుంట: తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లాలో అడుగు పెట్టాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఆదివారం కేటీఆర్‌, ఎంపీ విజయశాంతి విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశారు.…

చెరువులోపడి ముగ్గురి మృతి

మెదక్‌: ప్రమాదవశాత్తు చెరులోపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్పలో జరిగిన ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్యమ్మ (65), చంద్రకళ (35), మౌనిక (14) గా గుర్తించారు.

ధాన్యం కొనుగోలు ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు

  సిద్దిపేట: ధాన్యం కొనుగాలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవటంతో రైతుల పంటలకు సరైన ధర లభింయటం లేదని ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.