Friday, 20 November 2026

రంగారెడ్డి

మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న…

రంగారెడ్డి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్‌

రంగారెడ్డి,: జిల్లాలోని మేడిపల్లిలో ఘరానా దొంగ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న వెంకట్‌రెడ్డి నుంచి రూ.17 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మవారి ఆలయంలో చోరీ

రంగారెడ్డి : అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోగల ఓ దేవాలయంలో అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్బంగా హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే అమ్మవారి విగ్రహాన్ని ఊరిబయట పడేశారు. ఆదివారం…

కారు బోల్తా : యువకుడు మృతి

రంగారెడ్డి (మొయినాబాద్) : మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన సాయి(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను…

ముగ్గురు దొంగలు పరార్‌…వెండినగలు స్వాధీనం

రంగారెడ్డి,  : మేడ్చల్‌లోని పెద్దచెరువు దగ్గర పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఓ ఆలయానికి చెందిన వెండినగలను దొంగలు వదిలివెళ్లారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులమంటూ బెదిరించి.

 రంగారెడ్డి : ఈజీ మనీకి అలవాటుపడ్డ యువకులు కొందరు ఏకంగా పోలీసుల అవతారమెత్తారు. వచ్చీపోయే వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పాపం పండి చివరకు పోలీసులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆరుగురు యవకులు పోలీసులమంటూ…

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి.

రంగారెడ్డి : షామిర్ పేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కిరణ్ పై అమ్మాయి బంధువులు దాడికి యత్నించారు. కత్తులతో దాడి చేయడంతో కిరణ్ తీవ్రగాయాలకు పాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈఘటన చోటు…

విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : ప్రైవేటు పాఠశాల ఫీజుల కోసం వేధిస్తుండడాన్ని తట్టుకోలేక కరీంనగర్‌లో ఓ పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే…. ఫీజుల భారం భరించలేక మరో ఇంటర్ విద్యార్థి కాలేజీ భవనంపై…

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి : విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో ఆదివారం ఉదయం మొత్తం నలుగురు రైతులు పొలం పనులకు వెళ్తుండగా… పొలాల సమీపంలో విద్యుత్ తీగెలు తగిలి ఓ…