ట్రావెల్స్ బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి : ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఏపీ 28 డీ 4844 నెంబర్ గల రంగారెడ్డి జిల్లా…
రంగారెడ్డి : ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఏపీ 28 డీ 4844 నెంబర్ గల రంగారెడ్డి జిల్లా…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు బావిలో నీరు తోడి బాలుడి మృతదేహాన్ని బటయకు తీశారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ, మహిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సహస్రగళార్చానం, త్రిలక్షపారాయణం జరిగింది. శుక్రవారం వనస్థలిపురంలోని స్వరుషి గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పప్పు పద్మ ప్రసన్నకుమార్ స్వరకల్పనలో బచ్చులక్ష్మీ…
రంగారెడ్డి: శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో 4 బస్సులతోపాటు 3కార్లను అధికారులు సీజ్ చేశారు.
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం గొలుసుకట్టు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు…
రంగారెడ్డి, జిల్లాలో లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డుతున్న 30 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద కొంతమంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి లారీ డ్రైవర్లను బెదిరించి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు…
,రంగారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ మండలం కొత్తగడి గ్రామంలో అప్పుల బాధతో సత్తయ్య అనే 45 ఏళ్ల రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు
రంగారెడ్డి, : వికారాబాద్ పట్టణంలో డిగ్రీ విద్యార్థి భరత్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా కుందుర్గు మండలం రేగడి చిల్కామర్రి వాసి. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి, : జిల్లాలోని బంట్వారం మండలం తల్బట్టాపూర్లో లొంక ఆశయ్య అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో రైతు ఆత ్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. .
రంగారెడ్డి, మేడ్చల్ ఎలక్ర్టికల్ డీఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు డీఈ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.