Saturday, 28 November 2026

వార్తలు

దుండగుల చేతిలో అన్నదమ్ములు కత్తి దాడికి గురైయ్యారు

మణుగూరు: అన్నదమ్ములపై కత్తులతో దాడి జరిగిన ఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చయ్య (44), గోపయ్య (40)పై ఈరోజు ఉదయం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా…

ఛాప్రాలో బంద్‌ హింసాత్మకం

బీహార్‌: ఛాప్రాలో భాజపా, అర్జేడీ నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా వీరు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛాప్రాలో బంద్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు…

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ అర్పీరోడ్‌లోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య ఈరోజు మృతి చెందాడు. దీంతో సిటీలైట్‌ హోటల్‌ భవనం ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.

కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ ప్రవేశాల్లో అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రి పళ్లంరాజుకు లేఖ రాశారు. జేఈఈ ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఎం తన లేకలో కోరారు.

ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా భీమ్‌సేన్‌ బస్సీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి భీమ్‌సేన్‌ బస్సీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ జులై 31న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో బస్సీని ఈ స్థానంలో నియమించారు. 1977 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన బస్సీ…

బుద్ధగయ కేసు విచారణకు పాట్నాలో ప్రత్యేక న్యాయస్థానం

పాట్నా: మహాబోధి ఆలయంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై విచారణకు పాట్నాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. పాట్నా సివిల్‌ కోర్టు అవరణలోనే దీన్ని ఏర్పాటు చేశారు. 1500 ఏళ్ల చరిత్ర గల మహాబోధి ఆలయ ప్రాంగణంలో…

రూ. 11లక్షల నగదు చోరీ

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం నందిహిల్స్‌ కాలనీలో ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 11 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు సమాచారం.

గర్భిణులకు ఉచిత వైద్య సహాయం అందిస్తారన్న ఆజాద్‌

జైపూర్‌: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గర్భిణులకు ఉచిత వైద్య సదుపాయం, సమయానికి ఆస్పత్రికి చేరుకోవడానికి అంబులెన్సు సౌలభ్యం కల్పించనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు. జననీ సురక్ష పథకం కింద గర్భిణులకు, బాలింతలకు ఉచిత…

సీబీఐ ముందు హాజరైన బ్యాంకుల అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో జాతీయ బ్యాంకుల అధికారులు ఈరోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రతినిధి రాఘరావు కూడా సీబీఐ ముందు హాజరయ్యారు.