Saturday, 28 November 2026

వార్తలు

స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ చర్యలతో రూపాయి విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ రూ.59.35 పైసలుగా ఉంది.

ఆటగాళ్లు మోసం చేశారని రాహుల్‌ ద్రవిడ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ వివరణకు పోలీసులు రికార్డు చేశారు. ఆటగాళ్లు తనను మోసం చేశారని పోలీసులకు రాహుల్‌ ద్రావిడ్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు: మంత్రి చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు ఆహ్వానించనున్నట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 1.15లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించనున్నట్లు…

దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ దినేష్‌రెడ్డి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలుపై ఉన్న దుర్గమ్మను డీజీపీ దినేష్‌రెడ్డి దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా, కమిషనరేట్‌ పోలీసు అధికారులతో ఇవాళ డీజీపీ సమీక్ష నిర్వహించనున్నారు.

ఘనంగా ప్రారంభమైన శ్రీవారికి సాలకట్ల ఆణివార ఆస్థానం

తిరుమల: తిరుమల శ్రీవారికి వార్షికోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన సాలకట్ల ఆణివారి ఆస్థానం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఆణిమాసం చివరి రోజు ప్రతి ఏటా ఈ ఆణివారి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయ వ్యయాలు,…

ఆర్టీసీ బస్సులో పొగలు….. పరుగులు తీసిన ప్రయాణికులు

మధిర : ఖమ్మం జిల్లా మధిర అంబేద్కర్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. బస్సులోని బ్యాటరీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పొగలు వ్యాపించాయని డ్రైవర్‌ తెలిపారు. భీమవరం నుంచి 70…

గోతిలో పడి వ్యక్తి మృతి

ఉంగుటూరు: సుమారు 20 అడుగుల లోతున్న గోతిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జరిగింది. అంజినేయులు అలియాన్‌ అంజి (45) పామాయిల్‌ తోటలో వాచ్‌మెస్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం…

టెట్‌ ప్రకటన వెలువడింది

రుసుము 100 తగ్గింపు హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటన వెలువడింది. ఏపి ఆన్‌లైన్‌ ఈ సేవా ద్వారా రుసుముల చెల్లింపు సోమవారం నుంచి మొదలైంది. అన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుండి ప్రారంభంకానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీన…

వడ్డీ రేటు సవరించిన ఆర్‌బిఐ

ముంబయి: రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకువడ్డీ రేటును గరిష్టంగా 10.25కు సవరించింది. ఈ నిర్ణయం తక్షణమే అములులోకి వస్తుందని తెలిపింది. 12 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ హామీ పత్రాలను ఈ నెల…