Saturday, 28 November 2026

వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్‌ గ్రామ శివారులో లారీ ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు…

ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చెప్పడం భావ్యం :వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడం భావ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. లగడపాటి అంటున్న స్టార్‌ బ్యాట్స్‌మెస్‌ ఎవరో చెబితే తాము తగిన బౌలర్‌ను రంగంలోకి దించుతామని సవాల్‌& విసిరారు. తమకు ప్రత్యేక…

అప్పులబాధతో ఉరి వేసుకోని రైతు మృతి

వర్గల్‌ : మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం మీనాజీపేట గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తారం యాదయ్య (35) అనే రైతు భార్యాపిల్లలు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గౌరారం పోలీసులు కేసు…

కేరళలో అదుపుతప్పిన బస్సు ఢీ:ఐదుగురి మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. చడాయమంగళం-ఆయూరు మార్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థక చెందిన బస్సు ఓ ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం…

రిలయన్స్‌ దోపిడీపై చర్చిస్తామన్న నారాయణ

కాకినాడ : కేజీ బేసిస్‌లో రిలయన్స్‌ సహజ వాయువు దోపిడీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరగనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో రిలయన్స్‌ దోపిడీపై…

రూ. 12 లక్షల నగదు స్వాధీనం

గుంటూరు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం గొడవారిపాలెం చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ. 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కారులో తరలిస్తున్న రూ. 29లక్షల పట్టుకున్న పోలీసులు

శ్రీకాకుళం: ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు ఈ ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కటక్‌ నుంచి విశాఖకు కారులో తరలిస్తున్న రూ. 29లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కన్నా లక్షీనారాయణ

తిరుమల: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటుడు తరుణ్‌ కూడా…

పెద్ద దర్గాను దర్శించుకున్న తెలుగు సినీ నటుడు కల్యాణ్‌రామ్‌

కపడ: భారతదేశంలో త్రీడి రూపంలో వచ్చిన తొలి యాక్షన్‌ చిత్రం ‘ఓం’ను ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని ఆ చిత్ర కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. కడప పెద్ద దర్గాను సోమవారం ఆయన దర్శించుకున్నారు. చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు…