Thursday, 26 November 2026

వార్తలు

నేడు భేటీకానున్న మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులకు అమలవుతున్న బోధన రుసుము, ఉపకార వేతనాల పథకాన్ని సమీక్షించనున్నారు.

ఆధార్‌ కార్డుల కోసం బారులు తీరిన జనం

కర్నూలు : నగరంలో ఆధార్‌ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. దీంతో ఆధార్‌ కేంద్రం వద్ద తీవ్ర రద్దీ నెలకొని, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్క ఆధార్‌ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేయడంపై…

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): ఇవాళ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. 350 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 105 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. రూపాయి స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 59.32.

సర్పంచ్‌ అభ్యర్థిపై కత్తితో దాడి

బోయినపల్లి : కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి దేశిరెడ్డి నర్సింహారెడ్డిపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. సోదరుని కుమారుడు రాజు కత్తితో నర్సింహారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడు. నర్సింహారెడ్డిని…

భారీ వర్షాల కారణంగా వెనుదిరిగిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నవరం: భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ప్రతిరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి స్పైన్‌జెట్‌ విమానం రాకపోకలు సాగిస్తుంది. ఈరోజు ఉదయం 8గంటలకు గన్నవరం వచ్చినప్పటికీ భారీ వర్షం కురుస్తుండటంతో అధికారులు ఉదయం 8.30గంటలకు…

కారు బోల్తాపడి నలుగురికి గాయాలు

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై దెందులూరు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాదులోని బోయినపల్లి ప్రాంతానికి చెందిన పచ్చళ్ల…

పదవులకు వేలం పాడితే కఠిన చర్యలు తీసుకుంటాం:నవీన్‌ మిట్టల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ సర్పంచ్‌ పదవులకు వేలం పాట పాడితే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు ఇప్పటికే నాలుగు చోట్ల ఎఫ్‌ఐఆర్‌ పమోదు చేశామని ఆయన తెలిపారు.

ఇరు పక్షాల నేతలో భేటీ కానున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రోడ్‌ మ్యాప్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తు, సీమాంధ్ర, తెలంగాణ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న సీఎం.

కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నా: బొత్స

హైదరాబాద్‌: విడిపోతాం అనేవారిని కూడా కలిసి ఉండాలని చెబుతూ కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సమైక్య, విభజనకు సంబంధించి అధిష్ఠానం నివేదిక కోరిందని, నివేదిక కోసం కసరత్తు జరుగుతు నిర్ణయానికి కాంగ్రెస్‌…

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు సాగిస్తుందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ద బౌద్ధ క్షేత్రం బుద్దడయలో చోటుచేసుకున్న…