Wednesday, 25 November 2026

వార్తలు

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నటికీ ఎన్డీయేలో భాగం కాదు: ఒమర్‌

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎప్పటికీ ఎన్డీయేలో భాగం కాజాలదని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. 3 లోక్‌సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఉన్న తమ పార్టీ ఎప్పటికీ బీజేపీతో పొత్తు…

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

గడ్చిరోలి,(జనంసాక్షి) ఆంధ్రప్రదేశ్‌- చత్తీస్‌గర్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కసనూరు అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు…

పాట్నాలో మహావీర్‌ దేవాలయం భద్రత పెంపు

పాట్నా: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో పాట్నాలోని మహావీర్‌ దేవాలయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవాలయం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్‌కె భరద్వాజ్‌ ప్రకటించారు. డాగ్‌స్క్వాడ్‌ని పంపించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నట్లు…

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహతుద్దులోని సేవాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు ముఖ్యనేతలున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పల్‌లో భాజపా ప్రజా చైతన్య సదస్సు

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య సదస్సు ఈరోజు నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో జరుగుతోంది. భాజపా నేతలు వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డా. లక్ష్మణ్‌, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమ బాట

కడప జిల్లా: కడప పట్టణంలో ఇవాళ సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రజాప్రతినిధులంతా ఉద్యమ బాట పట్టాలని తీర్మానించారు. రాష్ట్రంలో కంటే ఢిల్లీ సోనియా ఇంటి వద్ద అందోళనలు చేపట్టాలని…

బుద్ధగయకు బయల్దేరిన భాజపా ఎమ్మెల్యేల బృందం

బుద్ధగయ: బాంబు పేలుళ్లు జరిగిన మహాబోధి అలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి బీహార్‌ రాష్ట్రంలోని భాజపా ఎమ్మెల్యే బృందం బయల్దేరింది. రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ నేతృత్వంలో ఈ బృందం బుద్ధగయకు బయల్దేరింది.

ఎనిమిది నగరాలను అప్రమత్తం చేసిన హోంశాఖ

ఢిల్లీ: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని 8 ప్రధాన నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు ,పుణె, హైదరాబాద్‌ నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటికే పలుచోట్ల భద్రతాధికారులు…

ఉగ్ర దాడిపై మండిపడిన ప్రతిపక్షాలు

ఢిల్లీ : ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించినా తగిన భద్రతా చర్యలు తీసుకోక, ఉగ్రవాదుల దాడికి అవకాశమివ్వడం పట్ల కేంద్ర, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై భాజపా, ఇతర విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఇంటెలిజెన్స్‌ హెచ్చరించాక కూడా రాష్ట్ర ప్రభుత్వం…

వరంగల్‌ వెళ్లనున్న ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి వరంగల్‌ జిల్లా పర్యటనకు ఇవాళ బయల్దేరి వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన అక్కడ విడిది చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై జిల్లా ఉన్నతాధికారులతో రమాకాంత్‌రెడ్డి సమావేశం…