Wednesday, 25 November 2026

వార్తలు

సమైక్యాంధ్ర కోసం సంతకాల సేకరణ

గుంటూరు: రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరులో సంతకాల సేకరణ చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ కోర్‌కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. కోర్‌కమిటీ భేటీలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

విద్యా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగిన ఉపాధ్యాయులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంటర్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయులకు పదోన్నతులు కలిపించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఉధ్రిక్తత ఉర్పడటంతో…

రోడ్‌ మ్యాప్‌ పరిశీలించాక అధిష్ఠానానికి నివేదిస్తా దిగ్విజయ్‌

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను రోడ్‌మ్యాప్‌ తయారు చేయమని చెప్పినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో అయన మీడియాతో మాట్లాడుతూ…. రోడ్‌ మ్యాప్‌ను పరిశీలించిన తర్వాత అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెప్పారు.…

కిరణ్‌కుమార్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి,(జనంసాక్షి): కిరణ్‌ కుమార్‌ సర్కార్‌పై స్థానిక ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెష్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి శుక్రవారం తిరుపతిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరీకి నిరసనగా తిరుపతి కరకంబాడి రహదారిపై వృధ్దులు శుక్రవారం…

ఎన్నికల పరిశీలకులతో రమాకాంత్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమితులైన అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై పరిశీలకులతో చర్చించారు.

దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమైన ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో ఇవాళ అపార్టీకి చెందిన పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా నిలిపి స్తున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి…

మాతృభాషలో విద్యకై సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విచారణ కొనసాగనుంది.

అజిత్‌సింగ్‌తో ఐకాస నేతల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును మద్దతివ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు…

హాల్‌టికెట్ల కోసం మహాత్మగాంధీ యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు

నల్లొండ: నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లిలో బీఎడ్‌ వార్షిక పరీక్షలకు హాల్‌ టికెట్లు రాలేదని మహాత్మగాంధీ యునివర్శిటీ వద్ద విద్యార్థులు అందోళనకు దిగారు. అనుమతి లేకుండానే నార్కేట్‌పల్లి బీఎడ్‌ కళాశాల యాజమాన్యం ప్రవేశాలు నిర్వహించిందని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.