రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
విశాఖ,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.
విశాఖ,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్న తెలంగాణ సాధన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభా వేదికను కాంగ్రెస్ నేతలు గుత్తా సఖేందర్‌రెడ్డి, రాజయ్య, బసవరాజు సారయ్య సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ సాధన సభను మధ్యాహ్నం 2…
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): అమర్‌నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ వెళ్లే యాత్రికుల తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.
విశాఖ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ద్విగిజయ్‌సింగ్ ఇవాళ విశాఖకు రానున్నారు. విశాఖలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. దిగ్విజయ్‌సింగ్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.
తిరుమల,(జనంసాక్షి): ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ తిరరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి):హిమాయత్‌నగర్‌లో ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని తెలిపారు.
హైదరాబాద్,(జనంసాక్షి): కంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతె భేటీ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌కు చేరుకుని బొత్సను కలిశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కావూరి గాంధీభవన్‌కు రావడం ఇదే మొదటిసారి.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకమేర్పడింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా దాదాపు 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. సహాయ చర్యల కోసం వినియోగిస్తున్న…
హైదరాబాద్,(జనంసాక్షి): ముగ్గురు అదనపు ఎస్సీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎస్పీగా దేవదానం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్‌బాబు నియామకం అయ్యారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభకు ఎన్నికకావడానికి తనకు మద్దతు ఇచ్చినందుకు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యరాలు కనిమొళి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.