Wednesday, 25 November 2026

వార్తలు

తిరిగి జులై 4న ప్రజా పద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాలులో ఇవాళ సమావేశమైన ప్రజా పద్దుల సంఘం రెవెన్యూ అధికారులు పూర్తి సమాచారంతో రానందుకు వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 4న సమావేశం నిర్వహించాలని సంఘం నిర్ణయించింది.

పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై పోలీసులు దాడి చేశారు. రూ. కోటి విలువైన ఎపిడ్రియల్‌ మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు సరఫరా చేయడానికి సిధ్దమౌతుండగా ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

కోనేరు ప్రసాద్‌ పిటిషన్‌పై నిర్ణయం ఎల్లుండి

హైదరాబాద్‌ : దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్‌ నిందితుడు కోనేరు ప్రసాద్‌ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

జాతీయపార్టీల నేతల ముగిసిన టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జాతీయ పార్టీల నేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ ఈ నెల 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలిపారు. జులై 4,5 తేదీల్లో ఢిల్లీలో…

ఈ నెల 29న మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు కోదండరాం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఈ నెల 29న మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన జిల్లాల సాధన మాత్రమే తమ డిమాండ్‌ అని…

తిరుమలలో తప్పిపోయిన బాలిక దొరికింది

చిత్తూరు జిల్లా : గత నెల తిరుమలలో తప్పిపోయిన ఐదేళ్ల చిన్నారి రోషిణి శేషాచలపురంలో కనిపించింది. రోషిణిని తిరుమల పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

కార్మిక సంఘాలతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జులై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ సంఘాలు నిర్ణయించాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్దీ కరణ,…

కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం చర్చల విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమ్మెనోటీసు ఇచ్చిన ఆర్టీసీ గుర్తింపు సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపి చర్చలు విఫలమయ్యాయి. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌, వేతన సవరణపై యాజమాన్యం నుంచి హామీ రాలేదని గుర్తింపు సంఘాలు ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌…

రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. పొడవైన ఈ రైలు మార్గంలో అసియాలోనే రెండో పొడవైన సొరంగ…