Wednesday, 25 November 2026

వార్తలు

డబ్బులు వసూలు చేస్తున్న పోలీసుల అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): వ్యభిచార గృహాల్లో డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌ పాల్పడుతున్న ఇద్దరు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అర్టీసీ యాజమాన్యంతో కార్మికసంఘాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈయూ , టీఎంయూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వడంతో యాజమాన్యం తుది దఫా చర్చలు జరుపుతోంది.

పోలీసుల ఎదుట హాజరైన శంకర్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సైఫాబాద్‌ పోలీసుల ఎదుట మాజీ మంత్రి శంకర్‌రావు హాజరయ్యారు. నల్ల దుస్తులతో పీఎస్‌కు శంకరావు వచ్చారు. సీఎం కిరణ్‌,డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశరని శంకర్‌రావుపై ఆరోపణ ఉంది.

కదిరిలో మంత్రులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరిలో మంత్రులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం పర్యటనకు వెళుతున్న మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లను అడ్డుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కదిరిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…

ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 99వేల మంది యాత్రికులను సురక్షిత…

పబ్లిక్‌ అకౌంట్స్‌ సంఘం సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ కమిటీ హాలులో పబ్లిక్‌ అకౌంట్స్‌ సంఘం సమావేశం ప్రారంభమైంది. నీటి పారుదలశాఖకు సంబధించిన కాగ్‌ అభ్యంతరాలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో పెన్‌గంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిర్పూర్‌(టి) మండలం తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా కౌటాల, బెజ్జూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకెళ్లిన

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కి మధ్య అంగీకారం కుదరడం…

మనాలి-గుప్తకాశీ మార్గం మూసివేత

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని మనాలి-గుప్తకాశీ మార్గంలో బుధవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో రేపు మధ్యాహ్నం వరకూ గుప్తకాశీ వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు కేదార్‌నాథ్‌ను మబ్బులు పూర్తిగా కమ్మేశాయి. ఎటుచూసినా మంచు కమ్ముకుంది. భరీ వర్షాలు…