Saturday, 21 November 2026

వార్తలు

భారీగా వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రెండు రోజులుగా భారీగా వర్షం కురుస్తున్నందువల్లన ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాలలో 5.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కొడిమ్యాల మండలం నమిల కొండ ప్రధాన రహదారి పై మర్రిచెట్టు కూలడంతో రాకపోకలు స్తంభించాయి.

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు నారాయణ పిలుపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మగ్దూంభవన్‌పై పోలీసుల దాడికి నిరసనగా సీపీఐ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రేపు రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఓయూ విద్యార్థి పరిస్థితి విషమం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసుల బాష్పవాయువు ప్రయోగంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి కృష్ణానాయక్‌ పరిస్థితి విషమంగా ఉంది. మెదట గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. మరో 20…

వెస్టిండీన్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం అంతరాయం

కార్డిఫ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఈ రోజు వెస్టిండీన్‌,దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ ఇంకా మొదలవలేదు.

అరెస్టులను ఖండించిన కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖండించారు. జేఏసీ నేతలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణవాదులు అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు తెలంగాణవాదులను పోలీసులు…

రేపటి బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

హైదరాబాద్‌ : తెరాస పిలుపు మేరకు రేపు జరగబోయే తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్లు బంద్‌కు మద్దతు తెలిపాయి.

చమురు దిగుమతి లాబీలు నన్నూ బెదిరించాయి: మొయిలీ

ఢిల్లీ : చమురు దిగుమతి లాబీల నుంచి ప్రతి మంత్రికి బెదిరింపులు ఎదురవుతాయని, ఆ లాబీలు తనను కూడా బెదిరించాయని చమురు, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.

వొడా ఫోనుకు 100 కోట్ల జరిమానా విధించిన టెలికాం శాఖ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): వొడాఫోన్‌కు కేంద్ర టెలికాం శాఖ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2003 నుంచి 2005 మధ్య ఎస్టీడీ సర్వీసులను లోకల్‌ సర్వీసులుగా మార్చినందుకు ఈ జరిమానా వేసింది. ఇదే తరహా ఆరోపణల మీద మే…

సీఎం పగసాధిస్తున్నట్లు కన్పిస్తోంది

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజలు తన వద్దకు వస్తానంటేదొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు.

వంద బస్తాల చౌకబియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన వంద బస్తాల చౌక ధర బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు.