Saturday, 21 November 2026

వార్తలు

ప్రధానితో సోనియాగాంధీ భేటీ

ఢల్లీి: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై వారు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

నిజాం కళాశాల హాస్టల్‌ ఖాళీ

హైదరాబాద్‌: శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నేపధ్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో ఉన్న నిజాం కళాశాల వసతి గృహీన్ని పోలీసులు ఖాళీ చేయించారు.

ఆర్టీసీ, రైల్వే ప్రయాణీకుల భద్రత ఏర్పాట్లు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ దృష్ట్యా బస్సులు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. స్థానిర పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. రైల్వే పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే…

నాగావళిలో భారీగా వరదనీరు

విజయనగరం: జిల్లాలోని నాగావళి నదిలో వరదనీరు పెరుగుతోంది. 50 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తోలపల్లి నిర్వాసిత గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రేపు చలో అసెంబ్లీ సందర్భంగా వారు శాంతి భద్రతలపై సమీక్ష జరుపుతున్నారు.

రైల్వేస్టేషన్‌లో తనిఖీలకు అదేశం

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు రైల్వే ఎస్పీ కాంతరావు తెలిపారు. సమస్యలపై ప్రయాణీకులు సంప్రదించాల్సిన కంట్రోల్‌ రూం నంబర్లను అధికారులు ప్రకటించారు. అవి: 040`27702337, 94409 04873

సీసీఎస్‌ వద్ద భాజపా ఎమ్మెల్యేల ధర్నా

హైదరాబాద్‌: నరగంలోని సీసీఎస్‌ వద్ద భాజపా ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన భాజపా కార్యకర్తలు, విద్యార్థులను విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అసెంబ్లీ ఉద్యోగులకు రాత్రి విధులు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులు ఈ రోజు రాత్రి కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.శాసనసభ పరిసరాల్లో 24 గంటలపాటు పూర్తిస్థాయి భద్రత కొనసాగిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత చర్చలు చేపట్టనున్నారు.

చలో అసెంబ్లీ కొన్ని ఎంఎంటీఎస్‌, రైలు సర్వీసులు రద్దు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ కారణంగా రేపు కొన్ని రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది.ఫలక్‌నుమా`సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా`హైదరాబాద్‌, లింగంపల్లి`హైదరాబాద్‌, ఫలక్‌నుమా`సికింద్రాబాద్‌, బొల్లారం`సికింద్రాబాద్‌, ఎంఎంటీఎస్‌లు, డెమూ సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి`సికింద్రాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ నడుస్తాయి. బొల్లారం`హైదరాబాద్‌, తాండూర్‌`హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్‌`తాండూర్‌,…