Thursday, 19 November 2026

వార్తలు

శ్రీశైలం ఆలయ సూపరిటెండెంట్‌ సస్పెన్షన్‌

శ్రీశైలం : శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయం సూపరిటెండెంట్‌ రాధాకృష్ణపై ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ సస్పెన్షస్‌ వేటు వేశారు. రోజూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న కారణంగా ఆయనను సస్పెన్షస్‌ చేసినట్లు ఈవో తెలిపారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడ్డాయి.

శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రికెట్‌ బుకీ అరెస్టు

హైదరాబాద్‌ : క్రికెట్‌ బుకీ మహ్మద్‌ యాఈను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి దుబాయి వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ యాఈ ముంబయి నుంచి అర్థరాత్రి…

క్రికెట్‌ బెట్టింగ్‌ వివాదంతో వ్యక్తి హత్య

కృష్ణాజిల్లా : విజయవాడ పట్టణంలో ఈనెల 19న న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ నన్నె మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. బలమైన గాయాలు కావడంతోనే నన్నె మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌…

మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు

ఖమ్మం జిల్లా : భద్రాచలం-చింతూరు, ఏడుగురాళ్ల-మల్లంపల్లి రహదారిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరుతూ బస్తర్‌ జిల్లా అదివాసీ సంఘం పేరుతో గోడపత్రికలు అంటించారు.

బాన్పువాడలో రేపు టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరం

నిజామాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించనుంది. రేపు బాన్పువాడలో టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. రాబోయే ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలో, ప్రజలను ఎలా చైతన్య…

24న సమావేశం కానున్న స్టీరింగ్‌ కమిటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఛలో అసెంబ్లీ, బయ్యారం బస్సు యాత్రపై చర్చించనున్నట్లు సమాచారం.

శ్రీనివాస్‌లో అల్లుడి ఇంట్లో సోదాలు

చెన్నై , జనంసాక్షి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీఈవో అయిన గునాథ్‌ మీయప్పన్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మీయప్పన్‌ను విచారించచడానికి ముంబయి పోలీసులు ఈరోజు ఉదయం…

రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీల ఉషోగ్రతలు నమోదయ్యాయి,

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 కోట్లు స్వాహా చేసినట్లు…