Thursday, 19 November 2026

వార్తలు

ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

కరీంనగర్‌ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భవిష్యనిధి డబ్బులు జమ చేయడం లేదంటూ నిరసనకు దిగారు. కార్మికులతో ఆసుపత్రి వర్గాలు చర్చలు చేపట్టాయి.

ఉజ్సెకిస్థాన్‌ చేరుకున్న ఉపరాష్ట్రపతి

తాష్కెంట్‌ : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఉజ్సెకిస్థాస్‌ చేరుకున్నారు. ఉగ్రవాద నిరోధంపై పరస్పర సహకారం తదితర అంశాలపై ఆ దేశ అధ్యక్షుడు ఇస్లాం కరిమోప్‌తో అన్సారీ చర్చించనున్నారు.

నేడు కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి సదస్సు

హైదరాబాద్‌ : స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగే సదస్సుకు కాంగ్రెస్‌ జిల్లా, నగర, పట్టణ…

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

రాజస్థాన్‌తో హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నేడే

రాత్రి 8 నుంచి సెట్‌ మ్యాక్స్‌లో వేదిక: ఢిల్లీ ఈసీజన్‌ అరంభంలోనే ఏమాత్రం అంచనాలు లేని జట్లలో అదొకటి! కానీ అనూహ్య విజయాలతో అందరినీ అశ్చర్యపరుస్తూ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది సస్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమైంది.…

ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

మెదక్‌జిల్లా : జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.

రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న నాగం ముఖ్య అనుచరుడు

హైదరాబాద్‌, టీఆర్‌ఎస్‌లోకి నేతల వలస కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నగర సమితి అధినేత నాగం జనార్ధన్‌ ముఖ్య అనుచరుడు ,మాజీ జెడ్పీటీసీ జి. జనార్ధన్‌గౌడ్‌ రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యలు ఇబ్రహీం…

తెలంగాణ సాధన మా జన్మహక్కు: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు తాము విశ్రమంచబోమని ఆయన స్పష్టం చేశరు.…

డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌ జిల్లా : నగరంలోని తిరుపల్లి వద్ద డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న పత్తిబేళ్లు తగలబడటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కడప కమిషనర్‌గా చంద్రమౌళీశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ

కడప : తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కడప నూతన నగరపాలక కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నగర పాలక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నగర శివారులో విలీనం చేసిన ప్రాంతాలపై ప్రత్యేకంగా…