Thursday, 19 November 2026

వార్తలు

ఇందిరా పార్కు వద్ద తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులంతా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

పలు జిల్లాల్లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రుల వ్యవహారంపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. చిత్తూరు, ఆదిలాబాద్‌, అనంతపురం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ధర్నా, రాస్తారోకోలు చేశారు.…

గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై చర్యలు

విశాఖ : సింహాచలం గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ గోపీనాథ్‌ను ఈవో రామచంద్రమోహన్‌ సస్పెండ్‌ చేశారు. గోశాల నుంచి ఈ ఉదయం 12 కోడె దూడలను అక్రమంగా తరలిస్తుండగా తరలిస్తుండగా…

బాబ్లీపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : బాబ్లీపై సచివాలయంలో ఈ ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న  ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.

సబితతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్‌ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన

హైదరాబాద్‌ : ధర్మాన ప్రసాదరావును మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్‌ ఈ ఉదయం కలిశారు. తనను బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయం శిరసావహించి పార్టీకి సేవచేస్తానని ఆయన…

నేటి నుంచి అప్పన్న చందనం విక్రయాలు

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలను ఈ ఉదయం ప్రారంభించారు. స్వామివారి చందనం కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 500 ప్యాకెట్లను విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలువురు భక్తులు చందనం అందక వెనుతిరిగిపోయారు.

మిట్టకూరపల్లెలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా : బైరెడ్డిపాలెం మండలం మిట్టకూరపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, బీన్స్‌, రాగి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

ఓయు జెఎసి గాంధీభవన్‌ ముట్టడి

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎయు జెఎసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌ ముట్టడించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి వెళ్లి లక్ష్మీబాయి అనే భక్తురాలని ఢికొట్టింది. ఆమె అక్కడికక్కడే దుర్మురణం…