Thursday, 19 November 2026

వార్తలు

అనకాపల్లి ఇంచార్జి నియామకానికి కోర్‌ కమిటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి నియామకానికి చంద్రబాబు 10 మంది సభులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు.

రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ సస్పెండ్‌

ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో క్రికెట్‌ బుకీగా వ్యవహరించాడనే ఆరోపణలు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దు

హైదరాబాద్‌, జనంసాక్షి: పవిత్రమైన క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఐపీఎల్‌ లీగ్‌ను రద్దు చేసి క్రికెట్‌లో పాత వ్యవస్థనే ఉంచాలని ఆయన శుక్రవారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపించినప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ…

జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి

యానాం: పుదుచ్చేరి ప్రభుత్వం యానాం నియోజకవర్గం అభివృద్దికి కేటాయించే నిధుల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఇవ్వాల్సిన నిధుల కంటే తక్కువ నిధులు మంజూరు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం యానాం…

19న బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం

ముంబయి: బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ ఈనెల 19న చైన్నలో అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్‌లో జరిగిన స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంపై చర్చించనున్నారు.

టీ ఎంపీల సమావేశం 18కి వాయిదా

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ఈ నెల 18 కి వాయిదా పడింది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది.

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను వారికి అప్పగిస్తామని…

తప్పు ఒప్పుకున్న అంకిత్‌ చవాన్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు అంకిత్‌ చవాన్‌ తప్పు ఒప్పుకున్నాడు,. ప్రస్తుతం పోలీస్‌ కస్టడిలో ఉన్న అంకిత్‌ విచారణ సందర్భంగా బోరున విలపించినట్లు సమాచారం. తాను స్పాట్‌ ఫిక్సింగ్‌ పాల్పడింది నిజమేనని…

సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.