Thursday, 19 November 2026

వార్తలు

ఆసిఫ్‌నగర్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: అసిఫ్‌ ఏసిపి  కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే…

సూల్తాన్‌పూర్‌లో ఇరువర్గాల ఘర్షణ

కర్నూలు, జనంసాక్షి: ఆదోని మండలం సుల్తాన్‌పూర్‌లో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో 9 మందికి  తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆనుపత్రికి తరలించారు.

శ్రీకాంత్‌, గోపిచంద్‌ దంపతులు శ్రీవారి దర్శనం

తిరుమల, జనంసాక్షి: సినీహీరోలు గోపిచంద్‌, శ్రీకాంత్‌ దంపతులు ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్‌ మేకకోడలితో నిన్న గోపిచంద్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. నూతన దంపతులకు తోడుగా శ్రీకాంత్‌ దంపతులు

సింహాచలం గోశాలలో 20 కోడె దూడలు మృతి

విశాఖ, జనంసాక్షి: సింహాచలం గోశాలలో 20 కోడె దూడలు మృతి చెందాయి. గత పది రోజుల వ్యవధిలో మొత్తం 150 గోవులు మృతి చెందినట్లు సిబ్బంది చెబుతున్నారు. గోశాలలో సంరక్షణ చర్యలు లేకనే గోవులు మృతి చెందాయని విశ్వ…

17న పదవ తరగతి ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈనెల 17న పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. ఆరోజు ఉదయం 11గంటలకు మంత్రి పాన్ధసారథి ఫలితాలను విడుదల చేస్తారు.

కశపల్లిలో యువకుడి ఆత్మహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మందమర్రి మండలం కేశపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తిరుమల మొదటిఘాట్‌లో చెట్టును ఢీకొట్టిన జీప్‌

తిరుపతి, జనంసాక్షి: తిరుమల మొదటిఘాట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి గుడి వద్ద ఒక జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌, జనంసాక్షి: కోహీర్‌ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

సిలిండర్‌ పేలి మహిళ మృతి

వనపరి : గ్యాస్‌ సిలిండర్‌ పేలిఓ మహిళ మృతి చెందిన సంఘటన వనపర్తి మండలంలోని కడకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. శివమ్మ(26) అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమె…

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం

తిరుమల, జనంసాక్షి: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని వినాయకస్వామి గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వస్తున్న ఓ వాహనం కొండను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలిసులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.