Thursday, 19 November 2026

వార్తలు

12 నెమళ్ల స్వాధీనం

హైదరాబాద్‌ : జూపార్క్‌ సమీపంలోని ప్రాంతాల్లో  ఈ ఉదయం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో 12 నెమళ్లు నిర్బంధించినట్లు గుర్తించారు. నెమళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

యువకుడి దారుణ హత్య

జగ్గంపేట : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి రామకృష్ణ మృతదేహం మన్యవారిపాలెం గ్రామంలోని చెరువులో ఈ ఉదయం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

రాష్ట్రవాప్తంగా ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు. హైదరాబాద్‌లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు. 50 బస్సులపై…

రాష్ట్రవాప్తంగా ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు. హైదరాబాద్‌లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు. 50 బస్సులపై…

ప్రధానితో భేటీ అయిన సోనియా

ఢిల్లీ, జనంసాక్షి: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. కేంద్రమంత్రివర్గం నుంచి బన్సల్‌, అశ్వనీకుమార్‌ ను తొలగించే అంశంపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

రేపు పెళ్లిచేసుకోబోతున్న నయనతార

చెన్నై ,జనంసాక్షి: తమిళహీరో ఆర్యతో శనివారం తను పెళ్లిచేసుకోబోతున్నట్లుగా సినీనటీ నయనతార తన పీఆర్వో ద్వారా వెళ్లడించింది. ప్రభుదేవతో ప్రేమాయణం చేసిన తరువాత ఆర్యతో నయనతార కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రేపు రాత్రి 9 గంటలకు ఆర్యతో…

కర్ణాటక సీఎం గా ఎంపికైన సిద్ధరామయ్య

  బెంగళూరు, జనంసాక్షి: ఐదుగురు బరిలో ఉన్న కర్నాటక సీఎం పదవికి ఎంపిక ఎట్టకేలకు జరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడంతో సీఎం ఎంపిక అంశానికి తెరపడింది. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో…

బియ్యం గోదాములో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్‌: పెద్దపల్లి మండలం పెద్దకల్వల బియ్యం గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. రూ. 30 లక్షలవిలువైన 162 టన్నుల బియ్యం దగ్ధమైనట్లు సమాచారం అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన సీబీఐ డైరెక్టర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఈ రోజు ఇక్కడ కేంద్ర మంత్రి నారాయణ స్వామిని కలిశారు. సీబీఐపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వాఖ్యలపై వారు చర్చించారు. నారాయణ స్వామి ప్రధాన మంత్రి కార్యాలయం మంత్రిత్వ శాఖ…

ఎన్‌జీఆర్‌ఐ నేషనల్‌ టెక్నాలజీ డే నేడు

హబ్సిగూడ, : జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో శుక్రవారం నేషనల్‌ టెక్నాలజీడే లెక్చర్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిన్ట్‌ డా. భాస్కర్‌రావు తెలిపారు.ఎన్‌జీఆర్‌ఐలోని ఎన్‌బీ హాల్‌లో ఉదయం 11.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగునున్నట్లు పేర్కొన్నారు. స్పేన్‌…