Thursday, 19 November 2026

వార్తలు

సీఎం దళిత బంధు కాదు..దళిత ద్రోహి:రాఘవులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దళితుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని చెబుతున్న సీఎం కిరణ్‌ దళిత ద్రోహి అని సీపీఐ కార్యకర్త రాఘవులు తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు అన్ని విషయాలలో సీఎం అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో…

తిరుమల: విజిలెన్స్‌ అదుపులో ఇద్దరు దళారులు

తిరుమల,ఏప్రిల్‌25:తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.దళారులు ముని కృష్ణయ్య,ప్రవీణ్‌లు సేవా టికెట్లను 6 వేల రూపాయలకు అమ్మేందుకు యత్నించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీతోనే తెలంగాణ సాధ్యం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తా :నాగం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంతో అది సాధ్యం కాదని కేవలం భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగర్‌…

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన అన్నారు.’మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’అని చెప్పుకునేటట్లు తన పాలన…

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనికి…

తాళ్‌గంజ్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

ఆగ్రా,ఏప్రిల్‌ 25: ఆగ్రాలోని తాజ్‌మహల్‌ సమీప ప్రాంతంలోని తాళ్‌గంజ్‌లో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.తాళ్‌గంజ్‌లోని ఒక స్కూప్‌ షాప్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల సమాచారం.ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.

తమిళనాడులో అగ్ని ప్రమాదం: నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

తమిళనాడు,ఏప్రిల్‌ 25:తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు.బ్యాంక్‌ పనుల్లో అందరూ నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.ఆ మంటల్లో…

గుంటూరు :భవన పెచ్చులు వూడిపడి చిన్నారులకు గాయాలు

గుంటూరు,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.దీంతో చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

జేపీసీ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25 : 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై గురువారం సాయంత్రం జరుగనున్న జేపీసీ సమావేశం వాయిదా పడింది.

చిట్‌ఫండ్‌ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించనున్న కేంద్రం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25: పశ్చిమ్‌బెంగాల్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా చిట్‌ఫండ్‌ కంపెనీల తీరుపై కేంద్రం ఆరా తీయనుంది.