Tuesday, 17 November 2026

వార్తలు

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌ : ఖమ్మం , కడప జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులతో పాటు రైల్వే స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు తెదేపా ఎంపీలు నామా నాగేశ్వరావు ,సీఎం రమేష్‌లు, ఇవాళ సికింద్రాబాద్‌ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం…

ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో ముగిసిన భారత్‌ పోరు

తైపి : తైపిలో జరుగుతున్న ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారుల ఆట ముగిసింది. భారత బ్యాడ్మింటన్‌ ఆశాజ్యోతి పివి సింధు మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడు గేమ్‌ల పాటు పోరాడి ఓడిపోయింది. ఏడో సీడ్‌ జపనీస్‌ క్రీడాకారిణి…

కన్న వాడే కడతేర్చాడు కర్నూలు : ఆడపిల్ల పుట్టిందని ముక్కు పచ్చలారని కన్న కూతురినే కర్కశ తండ్రి నదిలో పడేశాడు కర్నూలు నగరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మధు అనే యువకుడు గత బుధవారం పుట్టిన తన కూతురిని…

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మామిడి పంట నేలరాలింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

శ్రీకాకుళం :జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. పలాస మండలం సున్నాడలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.

20 నుంచి సిఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌ : ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొంటారు. 20న విశాఖ, 21న రాజమండ్రి, 22న జడ్చర్ల, 24న చిత్తూరు , 25న కరీంనగర్‌ , 26న నల్గొండ, 27న ఆదిలాబాద్‌…

తెలంగాణపై మాట్లాడినందుకే కేకే పదవి ఊడింది.: వీహెచ్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై మాట్లాడినందుకే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు కు ఉన్న పదవి ఊడిందని ఆ పార్టీ ఎంపి వి.హనుమంతరావు చెప్పారు. ఏ పనిలేక ఆధిష్టానంపై ఒత్తిడి తెస్తానంటూ కేకే ఇష్టమొచ్చినట్ల వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీలను వెంటపెట్టుకుని…

కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

అక్కడక్కడా వానలు హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా కోస్తాంధ్రలో క్యుములో నింబస్‌ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. క్యుములో నింబస్‌ మేఘాల…

తామరం నుంచి నేటి పాదయాత్ర ఆరంభం

విశాఖ: విశాఖ జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న పాదయాత్ర ఈరోజు మాకవరపు పాలెం మండలం తామరం నుంచి ప్రారంభమైంది.

రూ.1.50 కోట్ల ఆభరణాలను శ్రీరామునికి అందజేసిన వివ్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సీతారాముని దేవాలయానికి తన సొంత డబ్బులతో తయారు చేయించిన 1.05కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ప్రభుత్వ వివ్‌ జయప్రకాష్‌ రెడ్డి అందజేశారు. ఈ నగలను శ్రీరామచంద్రునికి  అలంకరించారు.