Tuesday, 17 November 2026

వార్తలు

తిరుపతి సహా పలుచోట్ల భారీగా కూరిసిన వర్షం

హైదరాబాద్‌: శుక్రవారం సాయంత్రం తిరుపతి , శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతిలో ఉరుములతో కూడిన జల్లులు పడగా, శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం పుండిలో కుండపోత వర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. పలాస…

తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలంలో కేపీఆర్‌ సంస్థ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గ్రామస్థుల ఆందోళనలో పొక్లెయిన్‌ డ్రైవర్‌ గాయపడ్డాడు. గ్రామస్థులు పొక్లెయిన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ…

శంషాబాద్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం

హైదరాబాద్‌: నగర శివారులోని శంషాబాద్‌ మండలం శ్రీరామనగరం దివ్యసాకేతం వద్ద సీతారాముల కల్యాణవేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఈ వేడుకలు జరిగాయి. నగరంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చిన వేలాదిమంది…

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం బాలవరం కేపీఆర్‌ సంస్థ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేపీఆర్‌ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులను బాలవరం, జి.దొంతమూరు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

విద్యార్థులకు లావ్‌ట్యాప్‌, టాబ్లెట్‌లు

కర్ణాటక విధానసభ ఎన్నికల్లో భాజపా హామీ బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఓటర్లకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ ఎన్నికల ప్రణాళికను విడుదల ప్రణాళికను విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు లావ్‌ట్యాప్‌లు, టాబ్లెట్‌లు, ఒక్కో…

సీసీి కెమెరాల ద్వారా చిక్కిన దొంగలు

విశాఖపట్నం: వీఐపీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు దొంగలిస్తూ దొరికిపోయిన ఆరుగురు మహిళలను పోలీసులకు అప్పగించారు. వారు దుకాణంలో చీరలు దొంగిలిస్తూండగా సీసీ కెమెరాలలో కనిపించడంతో పట్టుకున్నారు. ఆ ఆరుగురు మహిళా దొంగలను త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

వడదెబ్బకు ఇద్దరి మృతి

నెల్లూరు: ఎండలు మండిపోతున్నాయి. వరణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మండుటెండలతో జనం అల్లాడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.

భర్త హత్య కేసులో భార్య అరెస్టు

చిత్తూరు: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్యను చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాటు తుపాకీతోపాటు ఓ…

కేంద్ర సాయం కోరనున్న తమిళనాడు

చెన్నై : తమిళనాడులో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రూ. 19,665 కోట్లను సాయంగా ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు సర్కార్‌ కోరనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని…

ప్రధానితో చర్చించే నిర్ణయాలు తీసుకున్నాం: రాజా

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించే అన్నీ  నిర్ణయాలు తీసుకున్నట్టు మాజీ టెలికాం మంత్రి రాజా స్పష్టంచేశారు. 2జి కుంభకోణంపై జేపీసీ విడుదల చేసిన ముసాయిదా నివేదికలో రాజాపైనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజా స్పందిస్తూ తాను…