Tuesday, 17 November 2026

వార్తలు

తేనేటీగల దాడిలో గాయపడిన ఉపాధి హమీ కూలీలు

వరంగల్‌, జనంసాక్షి: ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం యాపలగడ్డలో చోటు చేసుకుంది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

అనంతపురం, జనంసాక్షి: లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. తనకల్లు ఉద్దేహళ్ల పాఠశాలలలో పనిచేస్తున్న ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు డిఐఓ శ్యామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ముగ్గురి ప్రాణాలు తీసిన ఘర్షణ

కరీంనగర్‌, బోర్‌వెల్‌ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే దాకా వచ్చింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వేములవాడ మండలం మర్రిపల్లిలో చోటు చేసుకుంది. మృతుల వివరాలు…

4 వారాల వరకు పోడగించిన సంజయ్‌దత్‌ లొంగుబాటు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టులో వూరట లభించింది. ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో లొంగిపోవడానికి గడువు పెంచాలని ఆయన పెట్టుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లొంగుబాటుకు 4 వారాల గడువు పొడగించింది. లొంగిపోయేందుకు…

గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు, జనంసాక్షి: బాపట్ల మండలం ఈటేరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. పోలీనులు కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సౌర విద్యుత్‌ పరికరాల కంపెనీలను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని

న్యూఢిల్లీ : 2017 నాటికి అదనంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. సౌర విద్యుత్‌ పరికరాలు తయారు చేసే కంపెనీలను…

ఆజాద్‌తో బొత్స సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధినేత సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ఈ ఉదయం భేటీ అయ్యారు. కళంకిత మంత్రులు, తెలంగాణ ఎంపీల వ్యవహారంతోపాటు పలు అంశాలపై నేతలు ఈ భేటీలో చర్చింస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌లో సీఎం ఆజాద్‌తో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులు,…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఇరన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూప్రకంపనలు

టెహ్రాన్‌ , జనంసాక్షి: ఇరాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టల్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టల్‌ స్కేలుపై తీవ్రత 3.9 గా నమోదైంది.…