భీవితిలో ఆమ్ల వర్షం
బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్-షిర్డీ టూరిస్ట్ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్ వద్ద బస్సుపై దీపిడీ దొంగలు దాడి చేసినట్లు సమాచారం. ఇంకా ఘటనకు సంబంధించి…
హైదరాబాద్ : సరూర్‌నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ రామవావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల అతని ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఒంగోలు నుంచి…
మచిలీపట్నం : కృష్ణా విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్ పరీక్షలు 23 అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు పదో తేదీకి వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు.
వరంగల్, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం మధ్యలోంచే మంత్రి లేచి వెళ్లిపోయారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశం చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.