Tuesday, 17 November 2026

వార్తలు

హెల్త్‌కార్డులపై తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహం

హైదరాబాద్‌ : హెల్త్‌కార్డు విధివిధానాలపై తెలంగాణ ఉద్యోగసంఘల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షరతులతో కూడిన హెల్త్‌కార్డులు ఇస్తే అంగీకరించేదిలేదని చెప్పారు. అలాంటి పథకంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొనరన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఒప్పందానికే తాము…

గవర్నర్‌పై మోదీ విమర్శ

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గుజరాత్‌ గవర్నర్‌ కమలా బేణివాల్‌ తొక్కిపెట్టారని ముక్యమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికీ గవర్నర్‌…

బీజేపీ అగ్రనేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ, బీజేపీ అగ్రనేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో చార్టెడ్‌ఫ్లైట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, తదితరులు ఉన్నారు. బెంగళూరు ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

తిరుపతి : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తరహాలో తిరుపతి స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్‌ బాపిరాజు, ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రైల్వే అధికారి తేజ్‌పాల్‌ సింగ్‌ చెప్పారు. టీటీడీకి చెందిన గోవిందరాజుస్వామి సత్రాల్లో 2,3వ సత్రాలను రైల్వేస్టేషన్‌ అభివృద్దికి…

క్షమాపణ చెప్పిన అజిత్‌ పవార్‌

ముంబై : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణ చెప్పారు. నీటి ఎద్దడిపై శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో పవార్‌ దిగివచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్నారు.…

కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి:  కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందిం దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగి సాంకేతిక నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు.

నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కరీంనగర్‌ సీసీఎస్‌ పీఎస్‌ నుంచి నలుగురు దొంగలు పరారైన ఘటనకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు. కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను…

ఎల్లారెడ్డిపేటలో దొంగల ఘాతుకం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 3 తులాల బంగారు గొలుసు రూ. లక్ష చోరీకి పాల్పడ్డారు. దొంగలను చూసి కేకలు వేసిన వృద్దుడి నాలుకను దొంగలు కోసేసారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు…

‘దమ్ముంటే అనర్హులుగా ప్రకటించాలి’

కాకినాడ : దమ్మంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర బూటకపు…

పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు

ఖమ్మం, జిల్లాలోని బోనకల్‌ మండలం రాయన్‌పేటలో పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. దుండగలు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.