Tuesday, 17 November 2026

వార్తలు

ముళ్లపొదల్లో ఆడశిశువు

దేవరపల్లి : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొలిగొట్లలో శారదానది సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. గ్రామంలోని ఓ కుటుంబం ఆ శిశువును అక్కున చేర్చుకుంది.

యాచించి కాదు శాసించి తెలంగాణాను తెచ్చుకుందాం.: కేసీఆర్‌

భోదన్‌ : రాజకీయంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస ఆధినేత కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలను గెలచుకుంటే తెలంగాణ ను కేంద్రప్రభుత్వందానంతటా అదే…

ఐపీఎల్‌ -6లో కోల్‌కతా శుభారంభం

ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన డిపెండింగ్‌ చాంఫియన్‌ ఐపీఎల్‌ ఆరంభమైంది. కానీ అభిమానులు ఆశించినట్టు కాదు. బ్యాటింగ్‌ మెరుపుల్లేవు ..పరుగుల వరద పారలేదు. ..హోరాహోరీ పోరాటం లేదు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు డిల్లీ తలాడించక…

మరో పది డివిజన్ల ఏర్పాటుకు ప్రకటన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా 10 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రంగారెడ్డి తూర్పు రెవెన్యూ డివిజన్‌ పేరును సరూర్‌నగర్‌ డివిజన్‌గా మార్చారు. దేవరకొండ, రామాచంద్రాపురం, గురజాల ,అనకాపల్లి, నాయుడుపేట, ఆత్మకూరు (నెల్లూరు) ,మాల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌ ,కదిరి…

హెలికాప్టర్‌పై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దిగుతున్న హెలికాప్టర్‌పై మావోయిస్టులు రెండు రౌండ్‌ల కాల్పులు జరిపారు. గ్రీన్‌హంట్‌లో భాగంగా పోలీస్‌ బలగాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చెపడుతుండటంతో ప్రతిగా మావోయిస్టులు హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు.

మెగా టూరిజం

27 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం న్యూఢిల్లీ : సుదూర సాగర తీరం, రమణీయమైన ప్రకృతి, చారిత్రక కట్టడాల గొప్పదనం, కొండలు, కోనలు వాటి మధ్య సన్నగా పారే సెలయేళ్లు.. ఇలా ఎన్నో వింతలు, విశేషాలకు మన రాష్ట్రం…

అంబర్‌పేటలో కూలీన పాతగోడ

హైదరాబాద్‌ : అంబర్‌పేట వినాయక్‌నగర్‌ కూడలిలో ఓ భవనం పాతగోడ  కూలింది. శిథిలాల కింద కార్మికుడు చిక్కుకోవడంతో స్థానికులు   అతన్ని రక్షించే చర్యలు చేపట్టారు.

నల్గొండలో విస్తృత తనిఖీలు

నల్గొండ : నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు . ప్రకాశం జబార్‌, ఎస్పీటీ మార్కెట్‌, రామానంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించానా సమాచారం…

స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు

విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు. రుడాకోటలో వారు ఈ విషయంపై గోడపత్రికలు అంటించినట్లు సమాచారం.

పులివెందులలో నేలకొరిగిన అరటిపంట

కడప: పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం గునకనపల్లి, రామనూతనపల్లిలో పెనుగాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తీవ్రమైన పెనుగాలులుకు రెండు గ్రామాల్లో సుమారు 300 ఎకారాల్లో అరటిపంట నేలకొరిగింది. తమను ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.