Tuesday, 17 November 2026

వార్తలు

విజయమ్మ దీక్షపై వీరశివారెడ్డి అభ్యంతరం

హైదరాబాద్‌ : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెలేల నివాస ప్రాంగణంలో దీక్షకు ఎలా అనుమతించారని అ…

వీదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదు : చిరంజీవి

న్యూఢీల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదని ఢీల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన…

యువతులపై యాసిడ్‌ దాడి

న్యూఢీల్లీ : పాఠశాలనుంచి ఇంటికివెళ్లున్న నలుగురు అక్కాచెల్లెళ్లపై మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన యవతి ఢీల్లీలో చికిత్స పొందుతున్నట్లు పొలీసులు బుధవారం తెలిపారు. అక్కాచెల్లెళ్లలో ముగ్గురు…

39 మంది విద్యార్థినులకు అస్వస్థత

రెడ్డిగూడెం, కృష్ణా: కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారిని నూజీవీడు ఏరియా అసుపత్రికి తరలించారు. నూజివీడు ఆర్డీవో సుబ్బారావు , ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. బాలికలకు చికిత్స జరుగుతోంది.…

గుంటూరు వైద్యకళాశాలలో ఎంపీఐ బృందం తనఖీలు

గుంటూరు వైద్యం : గుంటూరు వైద్య కళాశాలలో 150 నుంచి 200లకు సీట్లు పెంచాలని పంపిన ప్రతిపాదనపై భారత వైద్య మండలి తనిఖీ బృందం బుధవారం కళాశాలకు వచ్చి పరిశీలన జరుపుతోంది. డాక్టర్‌ పాటిల్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు గంట సమయం పడుతోంది.

విజయవాడలో వామపక్షాల ఆందోళన

విజయవాడ : తాగునీరు, డ్రైనేజీ ఛార్జీల పెంపుపై వామపక్షాలు విజయవాడలో ఆందోళనకు దిగాయి. నగర పాలక సంస్థ కమిషనర్‌ ఛాంబంర్‌ను ముట్టడించి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పలువురి నేతలను పోలీసులు అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

శ్రీవారిని దర్శించుకున్న జయప్రద

తిరుమల : ఎంపీ జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చిట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఏసీబికి చిక్కిన ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు: మంగళగిరి ఎక్సైజ్‌ సీఐ యశోధరాదేవి 14వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలోని మంగళగిరి ఎక్సైజ్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు.