Tuesday, 17 November 2026

వార్తలు

ఛార్జీల పెంపుపై భగ్గుమన్న పాలమూరు రైతన్న

మహబూబ్‌నగర్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపుపై పాలమూరు రైతన్న కన్నెర్ర చేశాడు. గద్వాల మండలం అనంతారం సబ్‌ స్టేషన్‌ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

సీఎంపై మంత్రి రామచంద్రయ్య ఫైర్‌

హైదరాబాద్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపు వ్యవహరంలో మంత్రి రామచంద్రయ్య సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పై ఫైర్‌ అయ్యారు. సీఎంకు తెలువకుండానే ఈఆర్సీ ఛార్జీలు పెంచుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జీలను పెంచడం దారుణమని మంత్రి రామచంద్రయ్య అన్నారు.

ఖమ్మంలో స్పికర్‌కు తెలంగాణ సెగ

ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న స్పికర్‌ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీరును తెలంగాణపై నిలదీశారు. దీంతో స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ తెలంగాణ అంశం కేంద్రం…

భారత ప్రజాస్వామ్యంపరిపక్వతకు చేరలేదు

తొంబై శాతం ఓటర్లు మూర్ఖులే నేను అందుకే ఓటు వేయ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య న్యూఢిల్లీ, మార్చి 31 (జనంసాక్షి) : భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిపక్వత చెందలేదని ప్రెస్‌కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య…

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు వామపక్షాల దీక్షలు

హైదరాబాద్‌ : పెంచిన కరెంట్‌ ఛార్జీల పెంపుపై వామపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఇవాళ హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు దీక్షలు చేపట్టాయి. ఈ దీక్షల్లో వామపక్ష నేతలు నారాయణ ,రాఘవులు. తదితరులు పాల్గొన్నారు.

నోవార్టీన్‌ కంపెనీ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : క్యాన్సర్‌ మందుల తయారీ పేటెంట్‌ హక్కుల పై స్విట్జర్లాండ్‌ కంపెనీ నోవార్టీస్‌ పెట్టుకున్న పిటిషన్‌ సుప్రిం కోర్టు తిరస్కరించింది. నోవార్టీన్‌ కంపెనీ తన మందుల పేటెంట్‌ కోసం భారత్‌ లో 2006 నుంచి న్యాయపోరాటం చేస్తొంది.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలోని బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,170 కు అమ్ముడవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 28,570 గా ఉంది. కిలో వెండి ధర 53,850 గా పలుకుతుంది.

నేడు ఖమ్మం జిల్లాలో శాసనసభ కమిటీ పర్యటన

ఖమ్మం : స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ నేతృత్వంలోని శాసనసభ కమిటీ నేటినుంచి రెండు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఓపెన్‌ కాస్టులతో నిర్వాసితులవుతున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోనుంది.

గిట్టు బాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో ఆందోళన

ఖమ్మం : పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.

కాజీపేటలో సీఎం దీష్టిబొమ్మ దగ్ధం

వరంగల్‌ : కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు నిరసనగా ఇవాళ కాజీపేటలోతెలంగాణ వాదులు సీఎం కిరణ్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.