Tuesday, 17 November 2026

వార్తలు

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి స్థానం

న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మెడీకి స్థానం అభించింది. నూతన పార్లమెంటరీ బోర్డు వివరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. భాజపా ప్రధాన కార్యదర్శులుగా వరుణ్‌ గాంధీ,…

డీవైడర్‌ను ఢీకొన్న కారు : ముగ్గురికి తీవ్ర గాయీలు

రామ చంద్రాపురం : రావులపాలెంలోని జూనియర్‌ కళాశాల ఎదుట ఆదివారం ఉదయం మారుతి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వీరిని సమీపంలోని ఆసుపత్రికి…

‘విద్యుత్‌ ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలి’

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల నిర్ణయన్ని స్వాగతించలేమని ఉపాధ్యాయులు నియోజకవార్గాల నుంచి నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా గాదె శ్రీనివాసులు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఇటువంటి ఛార్జీలను భరించేందుకు ప్రజలు సిద్దంగా లేరని ఆయన…

మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన సబితా

హైదరాబాద్‌ : శంషాబాద్‌ మండలం కవేలిగూడలో దోపిడి దొంగల దాడిలో మరణించిన మల్లేష్‌ కుటుంబాన్ని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇలాంటి సరఘటనలు పునరావృతం…

ఆటో బోల్తా పడి ఒకరి మృతి

కర్నూలు : ఎమ్మిగనూరు డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…

ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాన స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బొడ్డు నాగేశ్వరరావు, గాదె శ్రీనివాసులు, పూల రవీందర్‌ల చేత శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.

‘ప్రభుత్వం దిగిరావాలి లేదా దిగిపోవాలి’

విజయవాడ : ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం వల్లే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ.వీ.రాఘవులు ఆదివారం విజయవాడలో వెల్లడించారు. సీఎంకు ధైర్యముంటే ఈఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్త్యురాలను బహిరంగ…

రాష్ట్రవ్యాప్తంగా ఈస్టర్‌ వేడుకలు

హైదరాబాద్‌ : ఈస్టర్‌ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జంట నగరాల్లోని ప్రముఖ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో వేడుకలు సూర్యోదయ ఆరాధనతో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో…

తమిళనాడులో స్టెర్‌లైట్‌ యూనిట్‌ మూసివేత

చెన్నై : తమిళనాడులోని టుటికారన్‌లో ఉన్న స్టెర్‌లైట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రాగి కర్మాగారాన్ని మూసివేయాలని తమిళనాడు కాలుష్యన నియంత్రణమండలి అదేశాలు జారీచేసింది. మార్చి 23న గ్యాస్‌ లీకవడంతో పరిసర గ్రామాల ప్రజలు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్లాంట్‌ను…

టిబెట్‌లో 83మంది సజీవ సమాధి

లాసా : టిబెట్‌లోని బంగారు గనిలో పనిచేసే 83 మంది కార్మికులు సజీవ సమాది. అయినట్టు చైనా అధికారిక టెలివిజన్‌ పేర్కొంది. కొండచరియ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. సహాయచర్యల్లో భాగంగా రెండువేలమందితో కూడిన సహాయకబృందాలు ప్రమాద…