కేంద్ర మంత్రివర్గం భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో నేర నిరోధక చట్టంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశం ఉంది.త
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో నేర నిరోధక చట్టంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశం ఉంది.త
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధుర సమీపంలో బస్సు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ : రాజీవ్‌రహదారిపై శామీర్‌పేట విద్యుత్ ఉపకేంద్రం వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై దోపిడి దొంగలు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, తులం బంగారం, రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డును…
ఇఫో (మలేసియా) : అజ్లాన్‌షా హాకీ టోర్నీలో ఫైన్ అవకాశాలు మెరుగవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియా, దక్షిణకొరియా చేతుల్లో వరుస ఓటములు చవిచూసిన భారత్.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.…
హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని రుషికేష్ వద్ద గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. అక్కడి…
విశాఖ : మల్కాపురంలోని ప్రకాశ్‌నగర్ ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక పాఠశాల వద్ద బాలుడిని దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలనికి చేరుకొని విచారణ చేపట్టారు.
చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాడార్ కంట్రోల్ రూంలో మంటలు చెలరేగి బ్యాటరీ దగ్ధమైంది. దీంతో ఇక్కడికి పలు విమానాలను హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలను దారి మళ్లించారు.
అభియోగాలను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు 13న హాజరుకావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు జనంసాక్షి, హైదరాబాద్ : ఓఎంపీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిపౖ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు…
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.