Monday, 16 November 2026

వార్తలు

మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు :సబిత

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళ దినోత్సవర సందర్భంగా  నెక్లెస్‌రోడ్డులో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.…

సీఐడీ అదుపులో ఉప్పల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ అమరయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్నూలు జిల్లా నిమ్మిగనూరు మున్సిపాలిటీలో జరిగిన కుంభకోణంలో ఈయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 -07 మధ్య కాలంలో  ఎమ్మిగనూరు…

ఢిల్లీ బయలుదేరిన సీఎం, బొత్స

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నేతలు అధిష్ఠానంతో చర్చించనున్నారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం: ఆరగంటపాటు నిలిచిన రైళ్లు

భువనగిరి : నల్గోండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్‌ ఔటర్‌ సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సికింద్రాబాద్‌ -కాజీపేట మార్గంలో నాలుగు ఎక్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. గోరక్‌పూర్‌, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి స్టేషన్‌లో, రాజధాని ఎక్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి.…

శాశ్వత సందర్శనకు చావెజ్‌ పార్థీవదేహం

కరకస్‌ : అనారోగ్యంతో కమ్నూమూసిన వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అంత్యక్రియలను నేడు అధికారికంగా నిర్వహించనున్నారు. అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివదేహాన్ని ప్రజల శాశ్వత సందర్శన కోసం మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టేలో భద్రపరచనున్నట్లు తాత్కాలిక అధ్యక్షుడు వికోలన్‌ మాడ్యురో…

బాంబు ఉందంటూ ఫోన్‌ చేసిన మహిళపై కేసు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్‌ చేసిన ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అర్థరాత్రి ఓ మహిళ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఫోన్‌ చేసింది. కాసేపటి తర్వాత బాంబు లేదంటూ మరోసారి…

రేషన్‌ బియ్యం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం తొండుపల్లిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 270 బస్తాల చౌక బియ్యాన్ని విజెలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మరో ఘటనలో నల్గొండ జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద…

మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో స్త్రీలు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత, రక్షణ కోసం అంకితం కావటానికి ఇదే సరైన తరుణమని పేర్కొన్నారు.…

ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు తహసీల్దార్‌ వాహనానికి నిప్పు

మహబూబ్‌నగర్‌ :మక్తల్‌ మండలం సంగంమండ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై రెవెన్యూ అధికారులు దాడులు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా ముఠాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 2 లారీలను, ఒక…